![don't 'Demon-etise' Tamil Pride - Sakshi](/styles/webp/s3/article_images/2017/10/21/RAHUL_MERSAL.jpg.webp?itok=PWRCr5mu)
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తొలిసారి మెర్శిల్ చిత్రం వివాదంపై ట్విటర్‌లో స్పందించారు. మెర్శిల్ సినిమా వివాదంలో ప్రధాని నరేంద్ర నరేంద్రమోదీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. సినిమా అనేది సంప్కృతి, సంప్రదాయాలు, భావాలను ప్రకటించే ఒక వేదిక అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. తమిళ సంస్కృతిని సినిమా మాధ్యమం ద్వారా ప్రకటించుకునే హక్కు వారికి ఉందని.. రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని జోక్యం చేసుకుని తమిళుల గౌరవానికి భంగం కలిగించరాదని రాహుల్ గాంధీ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్.. మెర్శిల్ చిత్ర బృందానికి తన నైతిక మద్దతులను తెలియజేశారు. చిత్రంలోని జీఎస్టీ గురించిన మాటలపై ప్రజల్లో సానుకూల స్పందన వస్తోందని ఆయన అన్నారు. మెర్శిల్ చిత్రాన్ని ముందే సెన్సార్ చేశారు.. రెండోసారి సెన్సార్ చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
Mr. Modi, Cinema is a deep expression of Tamil culture and language. Don't try to demon-etise Tamil pride by interfering in Mersal
— Office of RG (@OfficeOfRG) October 21, 2017
Comments
Please login to add a commentAdd a comment