సాక్షి, చెన్నై: 'ఇళయదళపతి' విజయ్ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా 'మెర్శల్'ను వివాదాలు విడిచిపెట్టడం లేదు. ఇప్పటికే బెంగళూరులోని ఈ సినిమా థియేటర్లపై దాడులు జరిగాయి. తెలుగులో విడుదలకావాల్సి ఉన్నా.. వివాదాల కారణంగా రిలీజ్ కాలేదు. తమిళనాడు అంతటా విడుదలై.. భారీ వసూళ్లు రాబడుతున్న ఈ సినిమాను మరో వివాదం చుట్టుముట్టింది. సినిమాలో విజయ్ పలు రాజకీయ డైలాగ్‌లు పేల్చడం కలకలం రేపుతోంది. ముఖ్యంగా వస్తుసేవల పన్ను (జీఎస్టీ), డిజిటల్ చెల్లింపులపై విజయ్ పేల్చిన డైలాగులు బీజేపీని అసంతృప్తికి గురిచేశాయి.
సినిమా నుంచి ఈ డైలాగులు వెంటనే తొలగించాలని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు తమిళిసాయి సౌందర్‌రాజన్ డిమాండ్ చేశారు. విజయ్ రాజకీయ లక్ష్యాలు ఉండటంతోనే ఆయన సినిమాలో ఈ డైలాగులు పేల్చారని విమర్శించారు. 'మెర్సల్ సినిమాలోని పలు డైలాగులు అభ్యంతరకరంగా ఉన్నాయి. జీఎస్టీ, డిజిటల్ ఇండియాను కించపరిచేలా ఉన్న డైలాగులను వెంటనే సినిమా నుంచి తొలగించాలి' అని ఆమె అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment