
తమిళనాట సంచలనంగా మారిన మెర్సల్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. చిత్ర నిర్మాతలు అభ్యంతరకర అంశాలను తొలగించేందుకు అంగీకరించినా వివాదం సద్ధుమణగటం లేదు. మరోవైపు కాంట్రవర్సీలతో సంబంధం లేకుండా ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తోంది. సినీ ప్రముఖుల నుంచి కూడా మెర్సల్ కు రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది.
ఇప్పటికే సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్.. మెర్సల్ సినిమాకు మద్ధతుగా ట్వీట్ చేయగా తాజాగా మరో సినీ ప్రముఖుడు మెర్సల్ వివాదంపై ఆసక్తికరంగా స్పందించారు. ప్రముఖ ఛాయగ్రాహకుడు సంతోష్ శివన్.. మెర్సల్ సినిమాను ఉద్దేశిస్తూ ఆసక్తికరమైన ట్వీట్ ను తన ట్విట్టర్ పేజ్ లో షేర్ చేశారు. 'ఇక మీదట సినిమాలకు కొత్త స్టాట్యూటరి వార్నింగ్ వేయాలేమో.. తమ సినిమా నిర్మాణంలో ఏ ప్రభుత్వాలను గాయపరచలేదు అని' అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ట్వీట్ స్క్రీన్ షాట్ ను తన పేజ్ లో పోస్ట్ చేశారు.
— SantoshSivanASC. ISC (@santoshsivan) 22 October 2017
Comments
Please login to add a commentAdd a comment