మాస్‌ చిత్రంగా మెర్‌సల్‌ | vijay new movie mersol teaser release today | Sakshi
Sakshi News home page

మాస్‌ చిత్రంగా మెర్‌సల్‌

Published Thu, Jun 22 2017 3:33 AM | Last Updated on Tue, Sep 5 2017 2:08 PM

మాస్‌ చిత్రంగా మెర్‌సల్‌

మాస్‌ చిత్రంగా మెర్‌సల్‌

తమిళసినిమా: మాస్‌ మమ్మం మాస్‌ అనగానే నాగార్జున నటించిన తెలుగు చిత్రం  మాస్‌ గుర్తు కొస్తుందా? ఇప్పుడు నటుడు విజయ్‌ అభిమానుల నోటా ఇదే మాట. అవును ఇళయదళపతి విజయ్‌ అభిమానులు ఆనందడోలికల్లో తేలిపోతున్నారు. అందుకు కారణం ఒకటి గురువారం విజయ్‌ పుట్టిన రోజు అయితే, మరొకటి ఆయన నటిస్తున్న తాజా చిత్రం పేరును ఖరారు చేయడంతో పాటు, చిత్ర ఫస్ట్‌లుక్‌ను బుధవారం విడుదల చేయడం.

తెరి వంటి సంచలన విజయం సాధించిన చిత్రం తరువాత విజయ్‌ను అట్లీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. తేనాండాళ్‌ స్టూడియోస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలో రూపొందుతున్న 100వ చిత్రం ఇదే. ఇప్పటికే 75 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం టైటిల్‌ ఏమిటన్న ఆసక్తి, ఇందులో విజయ్‌ గెటప్‌ ఎలా ఉంటుందన్న కుతూహలం ఆయన అభిమానుల్లో చాలా కాలంటా నెలకొంది. కాజల్‌అగర్వాల్, సమంత, నిత్యామీనన్‌ నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి మెర్‌సల్‌ అనే టైటిల్‌ను ఖారారు చేశారు.

అదే విధంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో దుమ్మురేపుతున్న పందెపు ఎద్దుల ముందు గ్రామీణ యువకుడిగా నిలబడ్డ విజయ్‌ గెటప్‌ పక్కా మాస్‌గా ఉండడంతో ఆయన అభిమానులిప్పుడు మమ్మం మాస్‌ అంటూ ఆనందం పట్టలేక కేరింతలు కొడుతున్నారు. మెర్‌సల్‌ పక్కా కమర్షియల్‌ కథా చిత్రంగా ఉంటుందనే నిర్ణయానికి చిత్ర వర్గాలు వచ్చేశారు. దీంతో మెర్‌సల్‌ చిత్రంపై అంచనాలు పైపైకి పెరుగుతున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement