
సాక్షి, చెన్నై: మెర్శల్ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది హీరోయిన్ కాజల్ అగర్వాల్. ప్రస్తుతం క్వీన్ చిత్ర తమిళ్ రీమేక్ ప్యారిస్ ప్యారిస్‌లో నటిస్తోంది. కాజల్ తెలుగులో తేజ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తోంది. ఈ బ్యూటీ నటిగా పరిచయం అయింది ఈ దర్శకుడి చిత్రంతోనే అన్నది గమన్హారం. కథానాయకిగా సెటిల్ అయిన తరువాత తన చెల్లెలు నిషాను కూడా సినిమాల్లోకి తీసుకొచ్చింది.
అయితే నిషా చాలా తక్కువ చిత్రాలతోనే సరి పెట్టుకంది. ఆపై అవకాశాలు లేకపోవడంతో పెళ్లిపై మొగ్గు చూపింది నిషా. 2013లో ఆ ముచ్చట తీర్చుకుని సంసార జీవితంలో సెటిల్ అయ్యారు. కాజల్ మాత్రం వరుస అవకాశాలతో తమిళం, తెలుగు భాషల్లో స్టార్ హీరోల సరసన నటిస్తూ క్రేజీ హీరోయిన్గా రాణిస్తోంది. కాగా మెర్శల్, తెలుగులో నేనే రాజు నేనే మంత్రి వంటి చిత్రాల సక్సెస్తో తన పారీతోషికాన్ని పెంచేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అవన్నీ వదంతులేనని కాజల్ కొట్టిపారేసింది.
చెల్లి పెళ్లి చేసుకోవడంతో అక్క పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నను కాజల్ అగర్వాల్ చాలా కాలంగానే ఎదుర్కొంటుంది. ఇదే ప్రశ్నకు తాజాగా స్పందించిన ఈ అమ్మడు ప్రస్తుతానికి తనకు పెళ్లి ఆలోచన లేదని స్పష్టం చేసింది. అయితే ఇంట్లో మాత్రం పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి చేస్తున్నారని చెప్పింది. మంచి వ్యక్తిత్వం కలిగి, తనను అర్ధం చేసుకునే వ్యక్తి కనపడితే పెళ్లి గురించి ఆలోచిస్తానని, అలాంటి వ్యక్తి కోసం అన్వేషణ జరుగుతోందని కాజల్ చెప్పారు. అయితే ప్రస్తుతానికి తన నట పయనాన్ని కొనసాగించడానికే ఇష్టపడుతున్నట్లు పేర్కొన్నారు. హీరోయిన్‌గా మంచి పాత్రల్లో నటించాలని ఆశిస్తున్నానని కాజల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment