తమిళసినిమా: మెర్శల్ చిత్రం దారి మళ్లింది. ఈ చిత్రం విడుదలకు ముందు సంచలనాలు, అనంతరం ప్రకంపనలు పుట్టిస్తోంది. చిత్ర తుది ఘట్టం సన్నివేశాల్లో జీఎస్టీ, వైద్య విద్యావిధానంపై సంభాషణలు అభ్యంతరకరంగా, ఉన్నాయంటూ రాష్ట్ర బీజేపీ నాయకుల నుంచి జాతీయ నాయకులు ఆ సన్నివేశాలను చిత్రం నుంచి తొలగించాలని డిమండ్ చేసిన విషయం తెలిసిందే. అందుకు చిత్ర నిర్మాత సమ్మతించినా పరిస్థితి చేయి దాటి వివాదం రాజకీయరంగు పులుముకుని రచ్చరచ్చగా మారింది. అయితే చిత్ర పరిశ్రమతో పాటు బీజేపీయేతర రాజకీయ పార్టీలు మెర్శల్‌కు అండగా నిలుస్తున్నారు. దీంతో పరిణామాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి.
ఐటీ ఉచ్చులో విశాల్..?
తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు, దక్షిణ భారత నటీనటుల ప్రధాన కార్యదర్శి నటుడు విశాల్ మెర్శల్ చిత్రానికి మద్దతుగా నిలిచారు. ఈ చిత్రాన్ని ఇంటర్నెట్‌లో చూశానని చెప్పిన బీజేపీ పార్టీ జాతీయ కార్యదర్శి హెచ్.రాజాను క్షమాపణ చెప్పాలని విశాల్ డిమాండ్ చేశారు. ఈ పరిణా మాల మధ్య మెర్శల్ వివాదం దారిమళ్లింది. సోమవారం మధ్యాహ్నం అనూహ్యంగా స్థానిక వడపళని, కుమరన్ కాలనీలోని విశాల్ కార్యాలయంలో ఐటీ ప్రత్యేక విభాగం అధికారులు టీడీ నాంగేంద్రకుమార్ బృందం సోదాలు చేసినట్టు మీడియాలో హల్‌చల్ చేసింది.
దిగజారుడు రాజకీయాలు..
కాగా తన కార్యాలయంపై ఐటీ దాడులపై స్పందించిన నటుడు విశాల్ దీన్ని దిగజారుడు రాజకీయాలకు అద్దం పట్టే చర్యగా పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని తాను చట్టపరంగానే ఎదుర్కొంటానని అన్నారు. అన్నాడీఎంకే పార్టీ శాసనసభ్యుడు, దక్షిణ భారత నటీనటుల సంఘం ఉపాధ్యక్షుడు, నటుడు కరుణాస్ మాట్లాడుతూ విశాల్ కార్యాలయంపై ఐటీ దా డులు దిగ్భ్రాంతికి గురి చేశాయన్నారు. ఇందులో కుట్ర కోణం దాగి ఉందా? అనే అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ప్రభుత్వం మౌనమేల..
మెర్శల్ చిత్ర వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహిస్తోందని, దీనికి కారణం బీజేపీ కట్టుబాటులో అన్నాడీఎంకే ఉండడమేనని కమ్యూనిస్ట్ పార్టీ నేత జి.రామకృష్ణన్ ఆరోపించారు.
విజయ్‌పై ఫిర్యాదు..
మెర్శల్ చిత్ర యూనిట్‌పై ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది. సోమవారం మధురైకి చెందిన న్యాయవాది ముత్తుకుమార్ అన్నానగర్ పోలీస్ స్టేషన్‌లో విజయపై ఫిర్యాదు చేశారు. అందులో మెర్శల్ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు దేశ మతసామరస్యానికి భం గం కలిగించేలా ఉన్నాయన్నారు. మసీదు, దేవాలయాలకు బదులుగా ఆస్పత్రిని కట్టాలన్న సన్నివేశం ఇది మతస్తుల మనోభావాలను దెబ్బతీ సేది గా ఉందన్నారు. జీఎస్టీ, వైద్యవిధానాలను విమర్శించేలా సన్నివేశాలు ఉన్నాయని కూడా పేర్కొన్నారు. విజయ్, సమంత, కాజల్ , నిత్యామీనన్, దర్శకుడు అట్లీ, నిర్మాత మురళిలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు కేసు నమోదు చేసే విషయంపై చర్చిస్తున్నారు.
మేం తనిఖీలు చేయలేదు..
విశాల్ కార్యాలయాల్లో తామెవ్వరూ తనిఖీలు చేయ లేదని ఆదాయ పన్ను శాఖ చెన్నై డివిజన్ అధికారిరాజశేఖర్ మీడియాకు తెలిపారు. దీంతో తనిఖీలు చేసిందెవరో అన్న చర్చ తెరమీదకు వచ్చింది.
దారి మళ్లిన మెర్శల్
Published Tue, Oct 24 2017 6:39 AM | Last Updated on Thu, Sep 27 2018 4:07 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment