
సాక్షి, చెన్నై: వివాదాల్లో చిక్కుకున్న తన తాజా సినిమా 'మెర్సల్'కు అండగా నిలిచి.. సూపర్‌హిట్ చేసిన ప్రతి ఒక్కరికీ తమిళ సూపర్ స్టార్ విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమాలో ప్రధాని నరేంద్రమోదీ మానస పథకాలైన జీఎస్టీ, డిజిటల్ ఇండియాపై విమర్శలు ఉండటంపై బీజేపీ నేతలు విమర్శల దాడి చేసిన సంగతి తెలిసిందే.
ఆసక్తికరంగా విజయ్ విడుదల చేసిన ఈ ప్రకటనలో పైభాగంలో 'జీసెస్ సేవ్స్' అని రాసి ఉండటంతోపాటు ఎడమవైపున సీ జోసెఫ్ విజయ్, కుడివైపున ఆయన చిరునామా రాసి ఉండటం గమనార్హం. మెర్సల్ సినిమా నేపథ్యంలో బీజేపీ నేతలు విజయ్ మతాన్ని కూడా వివాదంలోకి లాగిన నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. విజయ్ 'హిందువు' కాకపోవడంతోనే మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారని బీజేపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా ఏకంగా విజయ్ ఐడెంటిటీ కార్డును ట్వీట్ చేసి.. అందులో జోసెఫ్ విజయ్ అని ఉండటాన్ని ప్రస్తావించారు. ఇది 'చేదు నిజం' అంటూ కామెంట్ పెట్టారు.
అయితే, 'మెర్సల్' సినిమాపై బీజేపీ నేతల దాడి పెద్దగా ఫలించలేదు. కోలీవుడ్ మొత్తం విజయ్‌కు అండగా నిలిచింది. ఇటు ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పడుతూ ఘనవిజయాన్ని అందించారు. సినిమా పట్ల ఓ వర్గం వ్యతిరేకత చూపిందని, దీనికి సమాధానం అన్నట్టుగా కోలీవుడ్‌లోని తన మిత్రులు, నటులు, నటీమణులు, వివిధ సంస్థలు, జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు అనేకమంది సినిమాకు మద్దతు పలికారని, ఇందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ఆయన తన ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment