
ఇళయ దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం మెర్సల్. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలోని కొన్ని డైలాగ్ లు వివాదాస్పదం కావటంతో మెర్సల్ పై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. అయితే ఈ వివాదాల కారణంగా మెర్సల్ సినిమాకు ఆశించిన దానికన్నా ఎక్కువ ప్రచారం దక్కటంతో భారీ వసూళ్లను సాదిస్తోంది. తమిళ నాట తొలి వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది మెర్సల్.
తొలి ఆరు రోజుల్లో ఈ సినిమా తమిళనాట 84 కోట్ల వసూళ్లు సాదించింది. దీంతో ఇప్పటి వరకు 75.2 కోట్లతో మొదటి స్థానంలో ఉన్న రజనీకాంత్ కబాలి సినిమాను వెనక్కి నెట్టి విజయ్ మెర్సల్ టాప్ గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు మెర్సల్ 155 కోట్లకు పైగా వసూళ్లు సాదించినట్టుగా అంచనా వేస్తున్నారు. అయితే తమిళ్ తో పాటు తెలుగు నాట కూడా సినిమాను రిలీజ్ చేయాలని భావించినా.. సెన్సార్ సమస్యల కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment