
బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లోనూ సత్తా చాటుతున్న ప్రియాంక చోప్రా, సౌత్ సినిమాలు చేసేందుకు రెడీ అంటూ ప్రకటించింది. అంతేకాదు సౌత్ లో విజయ్ సరసన ఛాన్స్ వస్తే తప్పకుండా నటిస్తానంటూ క్లారిటీ ఇచ్చింది. అదే సమయంలో తన వస్త్రధారణపై వస్తున్న విమర్శలపై కూడా ఘాటుగా స్పందించింది ఈ బోల్డ్ బ్యూటీ.
'స్విమ్మింగ్ పూల్ లో బీచ్ లో చీరలతో తిరగం కదా.. అయినా నేను బాలీవుడ్ సినిమాల్లో కూడా బికినీ వేశాను. ఇప్పుడు హాలీవుడ్ లో అది కామన్ కాబట్టి అక్కడ కూడా అలాంటి దుస్తుల్లో కనిపిస్తున్నాను. ఈ మాత్రం దానికే ఎందుకంత దిగజారి కామెంట్లు చేస్తారో అర్థం కావటం లేద'ని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు తనను హాలీవుడ్ నటి అంటే సంతోషంగానే ఉన్నా.. వ్యక్తిగతంగా బాలీవుడ్ హీరోయిన్ అని పిలిపించుకోవటమే ఇష్టమని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment