మిలియన్ క్లబ్లో అర్జున్ రెడ్డి
యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి, ఇటీవల విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. వివాదాలతోనే భారీ పబ్లిసిటీ పొందిన ఈ సినిమా భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లోనూ అర్జున్ రెడ్డి సత్తా చాటుతున్నాడు. ఓవర్ సీస్ లో పెద్ద సంఖ్యలో థియేటర్లు దొరక్కపోయినా.. మంచి టాక్ రావటంతో వసూళ్లు భారీగా ఉన్నాయి.
తొలి రోజు 4.6 లక్షల డాలర్లు వసూళు చేసిన ఈ సినిమా రెండో రోజు 2.8 లక్షల డాలర్లు వసూళు చేసింది. ఇప్పటి మంచి వసూళ్లు సాధింస్తుండటంతో తొలి వారాంతానికి మిలియన్ మార్క్ ను ఈజీగా దాటేస్తుందంటున్నారు ట్రేడ్ పండితులు. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వసూళ్లతో దూసుకుపోతున్న అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండకు జోడిగా షాలిని పాండే నటించింది.