టాప్ టెన్లో 'అర్జున్ రెడ్డి'
వివాదాస్పద చిత్రంగా విడుదలై ఘనవిజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమా హవా ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్నో రికార్డ్ లను తన ఖాతాలో వేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓవర్ సీస్ మార్కెట్లో మరో రికార్డు ను అందుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్లో కూడా భారీ వసూళ్లు సాధిస్తున్న అర్జున్ రెడ్డి, అక్కడ హైయ్యస్ట్ గ్రాసర్స్ లిస్ట్లో టాప్ టెన్లో స్థానం సంపాదించుకుంది.
ఇప్పటి వరకు 16,82,000 డాలర్లు వసూళు చేసిన ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల లిస్ట్ లో పదో స్థానం దక్కించుకుంది. అర్జున్ రెడ్డి కన్నా ముందు బాహుబలి రెండు భాగాలతో పాటు శ్రీమంతుడు, అ..ఆ.., ఖైదీ నంబర్ 150, ఫిదా, నాన్నకు ప్రేమతో, అత్తారింటికి దారేది, జనతా గ్యారేజ్ సినిమాలు ఉన్నాయి. ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తుండటంతో ముందు ముందు మరిన్ని రికార్డ్ లు సాధించే దిశగా దూసుకుపోతోంది.