సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం మహర్షి. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా మాత్రం సత్తా చాటుతోంది. మహేష్ నటించిన 25 వ సినిమా కావటంతో పాటు భారీ హైప్ క్రియేట్ అవ్వటంతో మంచి వసూళ్లు రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమా ఓవర్‌సీస్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రాబట్టలేకపోతోంది.
సాధారణంగా మహేష్ బాబు సినిమాలకు ఓవర్‌సీస్‌లో మంచి క్రేజ్ ఉంటుంది. అయితే మహర్షి సినిమా విషయంలో ఆ క్రేజ్ కనిపించటం లేదన్న టాక్ వినిపిస్తోంది. తొలి రోజే మిలియన్ డాలర్ మార్క్‌ను ఈజీగా సాధిస్తుందని అనుకున్నారు. కానీ మహర్షికి మిలియన్ డాలర్ల మార్క్ అందుకోవడానికి మూడు రోజుల సమయం పట్టింది.
అంతేకాదు తొలి రోజు ఓవర్ సీస్‌లో నాన్ బాహుబలి రికార్డ్‌లను బద్ధలు కొడుతుందన్న అంచనాల మధ్య రిలీజ్ అయిన మహర్షి సినిమా ఖైదీ నంబర్ 150, భరత్ అనే నేను, స్పైడర్ సినిమాల కంటే చాలా వెనకపడింది. టాక్ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవటంతో ఫుల్‌రన్ లోనూ మహర్షి రికార్డ్ విషయంలో వెనకబడటం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.
Comments
Please login to add a commentAdd a comment