సూపర్ స్టార్, ప్రిన్స్, నాని ఇలా ముద్దుగా మహేష్ బాబును ఆయన ప్యాన్స్ పిలుచుకుంటూ ఉంటారు. ఆయన తండ్రి బాటలో నడిచిన బాటసారి. అందుకే ఆ దారి రహదారి అయింది. ఒక్కసారి మహేష్ క్రియేట్ చేసిన రికార్డులను తిరగేస్తే చెబుతుంది ఆయన ఫ్యాన్ బేస్ ఎలాంటిదనేది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు ఓవర్సీస్ లో కూడా మహేష్ కలెక్షన్ల సునామీ సృష్టించాడు.
(ఇదీ చదవండి: ఒకప్పటి స్టార్ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి ఫిక్స్ !)
ఆగష్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఆమెరికాలో ఆయన ఫ్యాన్స్ భారీగానే ప్లాన్ చేశారు. మరికొన్ని గంటల్లో ఈ వేడుకలు ప్రారంభం కానున్నా ఇప్పటికే సోషల్ మీడియాలో శుభాకాంక్షలతో మెసేజ్‌లు వెల్లువలా వస్తున్నాయి. దీంతో పాటు బిజినెస్‌మెన్ సినిమా కూడా రీరిలీజ్ కానున్నడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.
ఓవర్సీస్‌లో మహేష్‌నే కింగ్
ఇప్పటికీ ఓవర్సీస్‌లో కలెక్షన్స్ పరంగా టాప్ ప్లేస్‌లో అందనంత ఎత్తులో మహేష్ ఉన్నాడు. ఆయన నుంచి వచ్చిన 11 సినిమాలు వన్ మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసినవి ఉన్నాయి. తెలుగులో ఇతర హీరోలకి ఇప్పట్లో అందనంత దూరంలో టాప్ ప్లేస్‌లో ఆయన ఉన్నాడు. ఘట్టమనేని అభిమానులతో పాటు ఇండస్ట్రీకి చెందిన వారందరూ కూడా ఓవర్సీస్ గడ్డ మహేష్ బాబు అడ్డా అంటుంటారు. ఆయన తర్వాతి స్థానాల్లో తెలుగు నుంచి నాని, ఎన్టీఆర్‌లు ఉన్నారు. అమెరికా మార్కెట్ లో అత్యధిక సార్లు 1 మిలియన్ డాలర్స్ రాబట్టిన హీరోల లిస్ట్ రీసెంట్‌గా విడుదలైంది.
(ఇదీ చదవండి: నాకు నత్తి.. ఏం మాట్లాడినా ఎగతాళి చేశారు: హృతిక్ రోషన్)
ఇందులో బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ 30 సినిమాలు 1 మిలియన్ డాలర్లకు పైగా కలెక్ట్ చేశాయి. తర్వాత వరసుగా అక్షయ్ కుమార్ 25 సార్లు, సల్మాన్ ఖాన్ 23 సార్లు, హృతిక్ రోషన్ 17 సార్లు, ఆమిర్ ఖాన్ 13 సార్లు, అజయ్ దేవగన్ 12 సార్లు వన్ మిలియన్ డాలర్స్ బీట్ చేసిన వారిలో ఉన్నారు. ఈ లిస్టులో తెలుగు ఇండస్ట్రీ నుంచే కాదు.. సౌత్ మొత్తం నుంచి మహేష్ బాబు మాత్రమే ఉండడం విశేషం. ఇక్కడ జాబితాలో ఉన్న బాలీవుడ్ హీరోలందరూ కనీసం నలభైకి పైగా సినిమాలు చేసిన వాళ్లే ఉండగా మహేష్ మాత్రం కేవలం 27 సినిమాలకే అక్కడ చోటు దక్కించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment