
టాలీవుడ్ దేవసేన అనుష్క నటించిన భాగమతి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదైలనప్పటి నుంచి భారీగా వసూళ్లను రాబడుతోంది. తొలిరోజునే పాజిటాక్ తెచ్చుకున్న ‘భాగమతి’ అన్ని ఏరియాల్లో దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా మొదటివారం లోనే సుమారు రూ.20 కోట్లు వసూలు చేసి నిర్మాతకు భారీ లాభాలనే ముట్టచెప్పింది.
గతంలో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రుద్రమదేవి’ అమెరికాలో 9.71 లక్షల డాలర్లను వసూలు చేసింది. తాజాగా ‘భాగమతి’ ఆరికార్డును చెరిపేసింది. ఇప్పటికే 9.80 లక్షల డాలర్లను ఖాతాలో వేసుకున్న భాగమతి మిలియన్ మార్క్‌కు అతి సమీపంలో ఉంది. దక్షిణాదిన హీరోయిన్ ప్రధాన పాత్రలో రూపొందించిన సినిమాకు ఈ స్థాయి కలెక్షన్స్ రావడం ఇదే మొదటిసారి. భారీ కలెక్షన్లతో తన పేరుతో ఉన్న రికార్డును తానే తిరగరాసింది. మొత్తానికి చాలా మంది టాలీవుడ్ హీరోలకు సైతం సాధ్యం కాని రికార్డును అనుష్క అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment