ఓవర్సిస్‌లో దూసుకెళ్తోన్న ‘మహానటి’ | Mahanati Movie Crossed 2.5 Million Dollars In Overseas | Sakshi
Sakshi News home page

Published Tue, May 29 2018 10:51 AM | Last Updated on Tue, May 29 2018 11:12 AM

Mahanati Movie Crossed 2.5 Million Dollars In Overseas - Sakshi

అలనాటి అందాలనటి సావిత్రికి ఘన నివాళిగా నిలిచింది ‘మహానటి’. నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేశ్‌, సావిత్రి పాత్రకు ప్రాణం పోశారు. సినిమా విడుదలైనప్పటి నుంచి వసూళ్లలో రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన అన్ని కేంద్రాల్లో హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఓవర్సిస్‌లో ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. 

ప్రస్తుతం మహానటి ఓవర్సిస్‌లో 2.5 డాలర్ల కలెక్షన్లు కొల్లగొట్టింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మహానటి సినిమాకు కాలం కూడా కలసి వస్తోంది. ఈ వారం విడుదలైన సినిమాలకు పాజిటివ్‌ టాక్‌ రాకపోవడం కూడా మహానటికి కలిసి వచ్చే అంశం. ఈ సినిమా లాంగ్‌రన్‌లో మరిన్ని రికార్డులు సొంతం చేసుకుంటుందంటున్నారు విశ్లేషకులు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement