అడ్వాన్స్ బుకింగ్స్తోనే 3 మిలియన్లు
బాహుబలి 2 రిలీజ్ కు మరికొన్ని గంటల సమయం మాత్రం ఉంది. ఇప్పటికే రికార్డ్ ల వేట మొదలు పెట్టిన బాహుబలి.. యుఎస్ లో సంచలనాలు నమోదు చేస్తోంది. ఓవర్ సీస్ కలెక్షన్లలో మినియన్ మార్క్ చేరుకునేందుకు చాలా మంది స్టార్ హీరోలు కష్టపడుతుంటే బాహుబలి అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 3 మిలియన్లకు పైగా కలెక్ట్ చేసేసింది. బాహుబలి ప్రీ సేల్స్ లోనే మూడు మిలియన్లకు పైగా వసూళ్లు సాధించినట్టుగా యుఎస్ డిస్ట్రిబ్యూటర్స్ గ్రేట్ ఇండియా ఫిలిం ప్రకటించారు.
ఇప్పటికే భారీగా బుకింగ్స్ జరుగుతుండటంతో ప్రతీ గంటకు లక్ష డాలర్ల చొప్పున కలెక్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. బాహుబలి ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుండగా, ప్రీమియర్స్ షోను గురువారం రాత్రి నుంచే ప్రారంభిస్తున్నారు. కేవలం ఓవర్ సీస్ లోనే కాకుండా ఇండియాలోనూ ప్రీమియర్స్ షోస్ పేరుతో గురువారం రాత్రి నుంచే బాహుబలి ప్రదర్శనలు ప్రారంభిస్తున్నారు.