సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం భరత్ అనే నేను. బ్రహ్మోత్సవం, స్పైడర్ లాంటి రెండు డిజాస్టర్ ల తరువాత రిలీజ్ అయిన ఈ సినిమా మరోసారి మహేష్ కలెక్షన్ స్టామినాను ప్రూవ్ చేస్తోంది. శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన భరత్ అనే నేను తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది.
ఓవర్‌సీస్‌లో ఫ్లాప్ సినిమాలతో కూడా మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించే మహేష్, భరత్ అనే నేను సినిమాతో మరిన్ని రికార్డులు సాధిస్తున్నడు. తెలుగు రాష్ట్రాల్లో కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేసిన సూపర్ స్టార్ ఓవర్ సీస్‌లో రెండు రోజుల్లోనే 2 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించినట్టుగా అధికారికంగా ప్రకటించారు. మహేష్ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శరత్‌కుమార్, ప్రకాష్ రాజ్, ఆమని, సితారలు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
Bharat Ane Blockbuster
— BARaju (@baraju_SuperHit) 22 April 2018
Superstar @urstrulyMahesh's #BharatAneNenu crossed 2 Million mark in US within 2 Days
Comments
Please login to add a commentAdd a comment