
సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన రంగస్థలం సినిమాకు యూఎస్‌లో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. విడుదలైన అతితక్కువ రోజుల్లోనే రెండు మిలియన్ల మార్క్ కలెక్షన్లను ఈ సినిమా సొంతం చేసుకుంది. చెర్రీకి ఓవర్సీర్ మార్కెట్‌లో పెద్దగా పట్టు లేదనే వారికి ‘రంగస్థలం’ ద్వారా తన స్టామినా ఏంటో చూపించాడు.
ధృవ సినిమాతో యూఎస్‌లో మిలియన్ డాలర్ హీరోగా చెర్రీ ఎంట్రీ ఇచ్చాడు. ధృవ సినిమాకు చెర్రీ, చిత్రయూనిట్ కలిసి అమెరికాలో ప్రమోషన్ చేశారు. అయితే రంగస్థలం సినిమాకు మాత్రం యూఎస్‌లో ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టలేదు. దీంతో అభిమానులు కంగారుపడ్డారు. ఎలాంటి ప్రమోషన్స్ లేకుంటే ఓవర్సీస్‌లో కలెక్షన్లు తగ్గుతాయేమోనని అనుకున్నారు. కానీ కంటెంట్ ఉంటే ప్రమోషన్స్ లేకున్నా కలెక్షన్లు దుమ్ముదులుపుతాయని రంగస్థలం నిరూపించింది. గ్రామీణ నేపథ్యం, చెర్రీ నటన, సుకుమార్ టేకింగ్ ఈ సినిమాకు హైలెట్ కావడంతో ఎన్నారైలు సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. విదేశాల్లో ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.
Whatte solid #RangasthalamWave at the Box Office, #2MillionRangasthalam 🔥 pic.twitter.com/AkIAM1Z5Do
— Mythri Movie Makers (@MythriOfficial) April 1, 2018