ఓవర్సీస్‌లో దుమ్మురేపిన సాహో | Prabhas Saaho Crossed One Million Dollars In Overseas | Sakshi
Sakshi News home page

ఓవర్సీస్‌లో దుమ్మురేపిన సాహో

Aug 30 2019 7:48 PM | Updated on Aug 30 2019 8:36 PM

Prabhas Saaho Crossed One Million Dollars In Overseas - Sakshi

ప్రభాస్‌ నటించిన సాహో.. కలెక్షన్లపరంగా దుమ్మురేపుతోంది. బాహుబలి సిరీస్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌.. రెండేళ్ల గ్యాప్‌ తరువాత సాహోతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ బడ్జెట్‌ చిత్రం కావడం.. హాలీవుడ్‌ లెవెల్‌ యాక్షన్‌ సీన్స్‌తో తెరకెక్కించడంతో సాహోపై అంచనాలు ఆకాశన్నంటాయి. ఈ రోజు విడుదలైన సాహోతో.. అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
(‘సాహో’ మూవీ రివ్యూ)

అయితే ఈ చిత్రం ప్రభాస్‌ అభిమానులను సంతృప్తి పరిచేలా ఉందంటూనే.. కొంత డివైడ్‌ టాక్‌ను మూటగట్టుకుంది. అయినా.. వసూళ్లపరంగా రికార్డులను క్రియేట్‌ చేసేలా కనిపిస్తోంది. మొదటి రోజే ఈ చిత్రం దాదాపు 60-70 కోట్లు కలెక్ట్‌ చేస్తుందని అంచనా వేశారు. ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రం సత్తా చాటుతోంది. ఒక్కరోజులోనే మిలియన్‌ మార్క్‌ను క్రాస్‌ చేసి ఔరా అనిపించింది. ఈ మేరకు యూవీ క్రియేషన్స్‌, టీ సిరీస్‌ సంయుక్తంగా అధికారిక పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. మరి మున్ముందు ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు క్రియేట్‌ చేస్తుందో చూడాలి. యూవీ క్రియేషన్స్‌పై సుజీత్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement