సాయి పల్లవి సినిమా మళ్లీ వాయిదా | Sai Pallavi Kanam Release Postponed | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 17 2018 4:11 PM | Last Updated on Sat, Feb 17 2018 4:13 PM

Sai Pallavi Kanam Release Postponed - Sakshi

‘కణం’ మూవీ పోస్టర్‌

ఒక్క సినిమాతో టాలీవుడ్ స్టార్ ఇమేజ్‌ సొంతం చేసుకున్న నటి సాయి పల్లవి. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ మల్లార్‌ బ్యూటీ తరువాత ఎమ్‌సీఏ సినిమాతో మరోసారి ఆకట్టుకుంది. ప్రస్తుతం టాలీవుడ్‌ లో వరుసగా సినిమాలో చేస్తూ బిజీ అవుతోంది. ఈ భామ నటించిన మరో ఆసక్తికర చిత్రం కణం. నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ పాటికే రిలీజ్‌ కావాల్సి ఉన్నా వాయిదా పడుతూ వస్తోంది.

ముందుగా ఈ సినిమాను ఫిబ్రవరి తొలి వారంలో రిలీజ్ చేయాలని భావించారు. తరువాత ఫిబ్రవరి 23న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం కణం సినిమా మరోసారి వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాను మార్చి 9న రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతానికి రిలీజ్‌ డేట్‌ పై చిత్రయూనిట్ అధికారిక ప్రకటన చేయకపోయినా.. మార్చి 9న రిలీజ్ కావటం కాయంగా కనిపిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement