Kanam
-
అది గుర్తిస్తే లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్
‘‘గతం తాలూకు ఆలోచనలతో మనం దిగాలుగా ఉంటే అది బాధ. భవిష్యత్ గురించి ఆలోచిçస్తుంటే అది ఆశ. కానీ ఆలోచనలతో ఈ వర్తమాన క్షణాలను ఆస్వాదించడం మనం మర్చిపోతున్నాం. అది గుర్తిస్తే లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్. ఈ విషయాన్నే శ్రీ కార్తీక్ ‘ఒకే ఒక జీవితం’తో చెప్పాలనుకుంటున్నాడు. ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ అనేది ఒక భాగం మాత్రమే. నా పాత్ర, వెన్నెల కిశోర్, ప్రియదర్శి.. ఇలా ఏదో ఒక క్యారెక్టర్‌తో ప్రతి ఆడియన్ కనెక్ట్ అవుతారు’’ అన్నారు శర్వానంద్. శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతూ, శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో ‘కణం’). అక్కినేని అమల, ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. ‘‘ఈ చిత్రంలో శర్వానంద్ తల్లి పాత్రలో నటించాను. పదేళ్ల తర్వాత నేను చేసిన తెలుగు చిత్రం ఇది. ఈ సినిమాతో నాకు శర్వానంద్ మూడో కొడుకు అయ్యారు (నవ్వుతూ). ఈ సినిమాలో ముగ్గురి జర్నీ చూస్తారు. ఈ ముగ్గురూ కాలంతో ఆడుకుని ఓ అంశాన్ని కరెక్ట్ చేయాలనుకున్నప్పుడు విధి మాత్రం మారదు. ఎందుకనేది థియేటర్స్‌లో చూడాలి’’ అన్నారు అమల. ‘‘నేను తెలుగువాడినే. మా అమ్మగారి మాతృభాష తెలుగు. ఇప్పుడు మా అమ్మగారు లేరు. మా అమ్మ గురించి తీసిన సినిమా ఇది. ఈ సినిమా కోసం ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు రాసిన ‘అమ్మ’ పాట చిరకాలం నిలిచిపోతుంది’’ అన్నారు శ్రీ కార్తీక్. ‘‘మా బ్యానర్ నుంచి వచ్చిన ‘ఖాకీ’, ‘ఖైదీ’ చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఆ నమ్మకంతోనే తెలుగులో స్ట్రయిట్ ఫిల్మ్ ‘ఒకే ఒక జీవితం’ చేశాం’’ అన్నారు ఎస్ఆర్ ప్రభు. ‘‘అమలగారు నాకు స్ఫూర్తి’’ అన్నారు రీతూ వర్మ. -
Kanam Movie: సైన్స్ ఫిక్షన్‌గా అక్కినేని అమల 'కణం'.. రిలీజ్ అప్పుడే!
Akkineni Amala Kanam Movie Release Date Out: వైవిధ్య భరిత కథా చిత్రాల నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్. ఈ సంస్థ అధినేతలు ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్‌బాబు తాజాగా నిర్మిస్తున్న చిత్రం 'కణం'. నటి అమల అక్కినేని, శర్వానంద్, రీతూవర్మ, నాజర్, సతీష్, రమేష్ తిలక్, ఎమ్మెస్ భాస్కర్ తదితరులు ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ద్వారా శ్రీకాంత్ అనే దర్శకుడు పరిచయం అవుతున్నారు. దీనికి సుజిత్ సరాంగ్ ఛాయాగ్రహణం, జాక్స్ బిజాయ్ సంగీతం అందిస్తున్నారు. ఇది వైవిధ్యభరిత చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని మంగళవారం (ఆగస్టు 9) మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమని, గ్రాఫిక్స్‌పై ప్రత్యేక దృష్టి సారించిట్లు తెలిపారు. ఇటీవల విడుదలైన చిత్రంలోని అమ్మ పాటకు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. ద్విభాషా చిత్రంగా సెప్టెంబర్ 9వ తేదీన విడుదల చేస్తున్నట్లు తెలిపారు. తమిళంలో 'కణం' పేరుతోనూ, తెలుగులో 'ఒకే ఒక జీవితం' పేరుతో ప్రేక్షకులకు ముందుకు తీసుకొస్తామన్నారు. చదవండి: కారు ప్రమాదం, కోమాలోకి వెళ్లిన నటి సినిమా రిలీజ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు: అమలా పాల్ -
మైనార్టీలకు సీఎం జగన్ పెద్దపీట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్సీ జకియా ఖానం కొనియాడారు. నూతన ఎమ్మెల్సీగా ఎన్నికైన జకియా ఖానం సోమవారం సీఎంను క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం క్యాంపు కార్యాలయం వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సామాన్య కుటుంబానికి చెందిన తనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసినందుకు సీఎం జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపానన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, రాయచోటి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మహిళా సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానని చెప్పారు. తనకు ఈ పదవి రావడానికి కృషి చేసిన ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మిథున్‌రెడ్డి, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా జకియా ఖానమ్, రవీంద్రబాబు
సాక్షి, అమరావతి/రాయచోటి: రాష్ట్ర గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎం.జకియా ఖానమ్, పండుల రవీంద్రబాబు నియమితులయ్యారు. వారిద్దరినీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఎమ్మెల్సీలుగా నామినేట్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. కాగా, ఎం.జకియా ఖానమ్ వైఎస్సార్ జిల్లా రాయచోటికి చెందిన ముస్లిం మైనారిటీ మహిళ. డాక్టర్ పండుల రవీంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎంపీ. ఎస్సీ వర్గానికి చెందిన వారు. ఖాళీగా ఉన్న ఈ రెండు స్థానాలకు మైనారిటీ, బలహీన వర్గాల నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఎంపిక చేయటంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. వీరిద్దరి పేర్లను సిఫార్సు చేస్తూ ఇటీవల గవర్నర్‌కు పంపిన విషయం తెలిసిందే. సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా, పార్టీ అభివృద్ధికి పాటుపడతానని ఎమ్మెల్సీ మయాన జకియా ఖానమ్ తెలిపారు. గవర్నర్ నుంచి అధికారిక ప్రకటన రావడంతో జకియా ఖానమ్ స్పందించారు. వైఎస్సార్ కుటుంబానికి తన భర్త సన్నిహితంగా ఉండి పార్టీ కోసం పని చేశారన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకారాలను అందిస్తానన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం చూసి ఆశ్చర్యపోయా : ఎమ్మెల్సీ రవీంద్రబాబు ► రాజకీయాల్లోకి రాగానే అనేక మంది హామీలు ఇస్తారు.. కానీ అధికారంలోకి రాగానే అన్నీ మరిచిపోతారు. సీఎం వైఎస్ జగన్ మాత్రం ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసి గ్రేట్ అనిపించుకున్నారు. ► నాకిచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఎమ్మెల్సీని చేయడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. రాజకీయాల్లో ఇచ్చిన మాటను ఈ విధంగా నిలబెట్టుకుంటారా? ఇది నిజమా అని నేను, నా కుటుంబం, స్నేహితులు షాకయ్యాం. ► దళిత, గిరిజన, బలహీన వర్గాలకు ఒక అన్నగా నిలబడి సీఎం రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు. ► గత పదేళ్లు మేము అనాథలుగా ఉన్నాం. వైఎస్ జగన్ వచ్చాక దళిత, గిరిజన, బలహీన వర్గాలకు ఒక దిక్కు దొరికింది. ► పేద ప్రజలకు ఆయన ఎంతో అవసరం. జీవితాంతం ఆయనను గెలిపించుకుని అండగా నిలబడతాం. జకియా ఖానమ్ ప్రొఫైల్ పుట్టిన తేదీ: 01–09–1973 భర్త పేరు: దివంగత మయాన అఫ్జల్ అలీఖాన్ (మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ సీనియర్ నేత) పెళ్లి : 01–09–1989 తల్లిదండ్రులు: ఎం.హజీజ్ ఖానమ్, ఎం.దిలావర్ఖాన్ (రిటైర్డ్ హెచ్.ఎం) విద్యాభ్యాసం: ఇంటర్ (డిస్కంటిన్యూ) పిల్లలు: నలుగురు పండుల రవీంద్రబాబు ప్రొఫైల్ పుట్టినతేదీ: 8–11–1955 తల్లిదండ్రులు: బుల్లియ్య, అన్నపూర్ణాదేవి విద్యార్హత: ఎంబీబీఎస్, ఐఆర్ఎస్ భార్య: సునీత ఉద్యోగం: ఊ వైద్యుడిగా ఢిల్లీలో సేవలు ► ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌కు ఎంపికై ముంబై, కోల్‌కతా, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ కమిషనర్‌గా పనిచేశారు. రాజకీయ రంగ ప్రవేశం: 2014లో టీడీపీ నుంచి అమలాపురం ఎంపీగా గెలుపొందారు. ► 2019 మార్చిలో వైఎస్సార్సీపీలో చేరిక -
చిక్కుల్లో సాయి పల్లవి సినిమా?
ఫిదా బ్యూటీ సాయి పల్లవి తాజా చిత్రం కణం(తమిళంలో దియా) వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రం కథ తనదేనంటూ ఓ వ్యక్తి చిత్ర యూనిట్‌పై ఆరోపణలు చేస్తున్నాడు. కోలీవుడ్‌లో పలు చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన చంద్రకుమార్ తన కథను కణం యూనిట్ కాపీ కొట్టారంటూ నడిగర్ సంఘంలో ఫిర్యాదు చేశాడు. హీరోయిన్ అబార్షన్.. ఆమె కుటుంబం మిస్టరీగా చనిపోవటం లాంటి నేపథ్యం అంతా తన కథలోదేనని.. దియా(కణం) రచయిత రాజకుమారన్ తన కథను కాపీ కొట్టారంటూ చంద్ర ఆరోపిస్తున్నాడు. ఇప్పటికే డివైడ్ టాక్‌తో థియేటర్లో నడుస్తున్న ఈ చిత్రాన్ని.. ఈ వివాదం మరిన్ని కష్టాల్లోకి నెట్టేసింది. ఈ వివాదంపై స్పందించేందుకు నిర్మాతలు నిరాకరిస్తున్నారు. నాగశౌర్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ థ్రిల్లర్ మూవీకి ఏఎల్ విజయ్ దర్శకుడు. -
థ్రిల్లింగ్ పల్లవి
-
సినిమా నుంచి నేను కోరుకునేది ఆనందమే
‘ఫిదా, ఎంసీఏ’ సినిమాలతో తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకున్న సాయిపల్లవి ‘కణం’ సినిమాతో మరోసారి తెలుగు ఆడియన్స్‌ను పలకరించబోతున్నారు. నాగశౌర్య, సాయిపల్లవి జంటగా ఎ.ఎల్ విజయ్ దర్శకత్వంలో ఎన్.వి.ఆర్ సినిమా సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రం ‘కణం’. ఈ సినిమా నేడు రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా సాయిపల్లవి మాట్లాడుతూ–‘‘కణం’ సినిమా ద్వారా ‘ఒకటి ఫీల్ అవుతూ మరో ఎమోషన్ ఎలా ఎమోట్ చేయాలో’ అనే విషయం నేర్చుకున్నాను. ‘ప్రేమమ్’లో లవ్, ‘ఫిదా’లో ఇండిపెండెంట్ అమ్మాయిగా ఇలా ఒకే షేడ్ ఉన్న క్యారెక్టర్ ప్లే చేశాను. ఈ సినిమాలో అమ్మ పాత్ర పోషించాను. అమ్మ పాత్రకు చాలా షేడ్స్ ఉంటాయి. ఆ ఫీలింగ్స్ అన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. లోపల ఎంత బాధ ఉన్నా బయటకు కనిపించకుండా ఉండగలగటం కేవలం ‘అమ్మ’కు మాత్రమే సాధ్యం. ఈ సినిమా ద్వారా చాలా పరిణితి చెందాను అని అనుకుంటున్నాను. ఇలాంటి రోల్స్ ఎప్పుడూ వచ్చేవి కావు. దర్శకుడు విజయ్ సార్ చాలా స్వీట్. నేను ఇప్పటి వరకూ పనిచేసిన దర్శకులు నాకు ఏదో ఒకటి నేర్పించారు. ఇందులో యాక్ట్ చేసిన పాప వెరోనికాతో అటాచ్మెంట్ చాలా పెరిగిపోయింది. ఒకానొక టైమ్‌లో దత్తత తీసుకోవాలన్నంతగా క్లోజ్ అయిపోయాను. సినిమాలో నా పాత్ర నిడివి కంటే ఎంత ఇంపార్టెన్స్ అన్నది ముఖ్యంగా ఆలోచిస్తాను. సినిమా నుంచి నేను కోరుకునేది కేవలం ఆనందమే. ‘ఆ పాత్రను చాలా బాగా చేసింది’ అని ఆడియన్స్ ఫీల్ అయితే చాలు. ఈ సినిమా చూశాక స్క్రీన్ మీద ఒక అమ్మను ఆడియన్స్ చూడగలిగితే నేను సక్సెస్ అయినట్టే’’ అని పేర్కొన్నారు. -
సాయిపల్లవి సినిమా పేరు మారింది..!
తమిళసినిమా: కోలీవుడ్‌లో మంచి అంచనాలు నెలకొన్న చిత్రాల్లో కరు ఒకటి. కారణం నటి సాయిపల్లవి నటించిన తొలి తమిళ చిత్రం ఇదే కావడం. మలయాళంలో ప్రేమమ్ చిత్రంతో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న నటి సాయిపల్లవి, ఆ తరువాత తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై ఫిదా, ఎంసీఏ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేసింది. ఇప్పుడు కరు చిత్రంతో తమిళప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంతో కోలీవుడ్‌లోనూ మ్యాజిక్ చేస్తుందో? లేదోనన్న ఆసక్తి నెలకొంది. లైకా సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ దర్శకుడు. టాలీవుడ్ యువ నటుడు నాగశౌర్య ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. మరో విశేషం ఏమిటంటే ఇందులో నటి సాయిపల్లవి ఒక పాపకు తల్లిగా నటించింది. తొలి చిత్రంలోనే తల్లి పాత్రతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వడం గమనార్హం. అయితే ఈ చిత్రంపై సాయిపల్లవి చాలా ఆశలు పెట్టుకుందనే చెప్పాలి. నటుడు నిళల్గళ్ రవి, రేఖ ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతాన్ని, నీరవ్‌షా ఛాయాగ్రహణం అందించారు. మరో విషయం ఏమిటంటే చిత్రం ఈ నెల 27న విడుదలకు సిద్ధం అవుతోంది. ఇలాంటి సమయంలో చిత్రం పేరును దియా అని మార్చారు. ఇదే చిత్రం తెలుగులో కణం పేరుతో విడుదల కానుంది. ఇకపోతే నటి సాయిపల్లవి తాజాగా సూర్యకు జంటగా ఎన్జీకే, ధనుష్‌తో మారి–2 చిత్రాల్లో నటిస్తోంది. -
ఆ రోజు సినిమాలు మానేస్తా
‘‘కణం’ హారర్ సినిమా అనగానే ఫస్ట్ నో చెప్పా. విజయ్ గారు స్టోరీ పంపించారు. నేను చదవలేదు. అమ్మ చదివి, ఇలాంటి మంచి కథని ఎలా వదులుకుంటున్నావ్? అంది. అప్పుడు కథ పూర్తీగా చదివా. నచ్చడంతో ఓకే చెప్పా’’ అని సాయిపల్లవి అన్నారు. నాగశౌర్య, సాయిపల్లవి జంటగా ఎ.ఎల్. విజయ్ దర్శకత్వంలో ఎన్.వి.ఆర్. సినిమా సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ‘కణం’ ఈనెల 27న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సాయిపల్లవి పంచుకున్న చిత్ర విశేషాలు... ► ‘కణం’ కంటే ముందు కూడా హారర్ కథలు విన్నా. అయితే.. చేయలేనని వాళ్లతో డైరెక్ట్‌గా చెప్పలేదు. ఇంకో 2, 3 సినిమాల తర్వాత చేద్దామని చెప్పా. కానీ ‘కణం’ విషయంలో నో చెప్పినా తర్వాత ఎస్ చెప్పాను. లవర్‌గా, కూతురిగా యాక్ట్ చేయొచ్చు. కానీ, ఒక తల్లిగా నటించడం చాలా కష్టం. ప్రాక్టికల్‌గా నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి, చేయగలనా? అనిపించేది. ► ఈ సినిమా చేసేటప్పుడు వెరోనికాతో నిజంగానే ఒక తల్లిలా కనెక్ట్ అయిపోయా. ప్రతి పేరెంట్ ఈ సినిమాకి కనెక్ట్ అవుతారనడంలో అనుమానం లేదు. ఇలాంటి సినిమాలు ఇంకా చాలా రావాలి. ఈ స్టేజ్ ఆఫ్ కెరీర్లో తల్లిగా నటించాననే ఫీలింగ్ లేదు. తల్లిగా ఎప్పుడైతే చేయగలిగానో చాలా హ్యాపీ. ఇలాంటి పాత్రలు చేయడానికి ఏజ్‌తో, ఇమేజ్‌తో సంబంధం లేదు. ఎలా నటించామన్నదే ముఖ్యం. ► ‘ప్రేమమ్’ చిత్రానికి ముందు నేను జార్జియాలో ఉన్నప్పుడు మొటిమలు పోగొట్టుకోవడానికి చాలా చేసేదాన్ని. కానీ, అవి పోలేదు. అందుకే ‘ప్రేమమ్’ టైమ్‌లో కొంచెం భయపడ్డా. అందరూ నన్ను నాలా యాక్సెప్ట్ చేశారు. దాంతో నాకే కాదు.. అందరమ్మాయిలకు మంచి మెసేజ్ రీచ్ అయింది. ► ‘ప్రేమమ్, ‘ఫిదా, కణం’ చిత్రాల్లో నావి వేటికవే ప్రత్యేక పాత్రలు. ప్రస్తుతం నా ఆలోచన సినిమాల గురించే. డాక్టర్‌గా నా కెరీర్ బిగిన్ చేయాలనుకున్న రోజు సినిమాలు మానేస్తా. నాగశౌర్య గొప్ప నటుడు. ఈ చిత్రంలో కొన్ని సీక్వెన్సెస్‌లో తను ఇచ్చిన హావభావాలు ఇంటికెళ్లాక ట్రై చేసేదాన్ని. -
తల్లీ బిడ్డకు ఉన్న అనుబంధమే కణం – సాయి పల్లవి
నాగ శౌర్య, సాయి పల్లవి జంటగా ఏఎల్.విజయ్ దర్శకత్వంలో ఎన్.వి.ఆర్ సినిమా సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మించిన చిత్రం ‘కణం’. ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత ఎన్వీ. ప్రసాద్ మాట్లాడుతూ –‘‘ఈ సినిమాను మా బ్యానర్‌పై తెలుగులో రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. సాయి పల్లవి, నాగ శౌర్యకు ఈ సినిమా హ్యాట్రిక్ తెచ్చిపెడుతుంది అనుకుంటున్నాను. శ్యామ్ సి మ్యూజిక్, నిరవ్ షా విజువల్స్ ఈ సినిమాకు ప్లస్ అవుతాయి. దర్శకుడు విజయ్ ఏ ఉద్దేశంతో ఈ సినిమా తీశారో ఆ ఉద్దేశం నెరవేరాలని కోరుకుంటున్నాను. 37 రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేయడం నిజంగా చిన్న విషయం కాదు. తెలుగులో రిలీజ్ చేసే అవకాశం ఇచ్చిన లైకా ప్రొడక్షన్స్ వాళ్లకు థ్యాంక్స్’’ అన్నారు. సాయి పల్లవి మాట్లాడుతూ– ‘‘తల్లీబిడ్డకు మధ్య ఉన్న అనుబంధం, తపనే ఈ కథ. చాలా ఎమోషనల్ కనెక్ట్‌తో ఈ సినిమా చేశా. మంచి సినిమా చూశాం అనే ఫీలింగ్‌తో ఆడియన్స్ థియేటర్ బయటకు రావాలని విజయ్ చక్కగా రూపొందించారు. నాగ శౌర్య చాలా బాగా నటించారు. ఇంత మంచి సినిమాను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్‌కు థ్యాంక్స్. ‘ఫిదా, ఏంసీఎ’ సినిమాల్లాగే ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని అనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘మంచి సినిమాలను తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. 2013లోనే ఈ సినిమా ఆలోచన వచ్చింది. టైమ్ తీసుకొని చేద్దాం అని వెయిట్ చేశాను. నాగ శౌర్య, సాయి పల్లవి, వెరోనికా చాలా బాగా యాక్ట్ చేశారు. ఎన్.వీ.ప్రసాద్ గారు ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చారు’’ అన్నారు దర్శకుడు విజయ్. ‘‘నాగ శౌర్య, సాయి పల్లవి, వెరోనికా, దర్శకుడు విజయ్ అలాగే సినిమాకు పని చేసిన యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు జెమినీ కిరణ్. ‘‘సినిమాలో నటించిన అందరికి, అలాగే నా మిత్రుడు ఎన్.వి.ప్రసాద్‌కు అభినందనలు’’ అన్నారు నిర్మాత బీవీయస్ఎన్. ప్రసాద్. ‘‘నాగశౌర్య, సాయి పల్లవి మంచి ఫామ్‌లో ఉన్నారు. ఈ సినిమా కూడా వాళ్లకు పెద్ద సక్సెస్ తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నాను’’ అన్నారు శానం నాగ అశోక్ కుమార్. ఈ సినిమాకు సంగీతం: శ్యామ్ సి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.ప్రేమ్. -
'కణం' మూవీ స్టిల్స్
-
సాయి పల్లవి సినిమా మళ్లీ వాయిదా
ఒక్క సినిమాతో టాలీవుడ్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న నటి సాయి పల్లవి. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ మల్లార్ బ్యూటీ తరువాత ఎమ్సీఏ సినిమాతో మరోసారి ఆకట్టుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా సినిమాలో చేస్తూ బిజీ అవుతోంది. ఈ భామ నటించిన మరో ఆసక్తికర చిత్రం కణం. నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ పాటికే రిలీజ్ కావాల్సి ఉన్నా వాయిదా పడుతూ వస్తోంది. ముందుగా ఈ సినిమాను ఫిబ్రవరి తొలి వారంలో రిలీజ్ చేయాలని భావించారు. తరువాత ఫిబ్రవరి 23న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం కణం సినిమా మరోసారి వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాను మార్చి 9న రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతానికి రిలీజ్ డేట్ పై చిత్రయూనిట్ అధికారిక ప్రకటన చేయకపోయినా.. మార్చి 9న రిలీజ్ కావటం కాయంగా కనిపిస్తోంది. -
‘అసలేంటి భయ్యా ఈ ఊరి గొడవ’
ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన యంగ్ హీరో నాగశౌర్య ఇటీవల కాస్త స్లో అయ్యారు. వరుసగా ఫెయిల్యూర్స్ పలకరిస్తుండటంతో సినిమాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ యువ కథానాయకుడు రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. తమిళ దర్శకుడు విజయ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ‘కణం’ సినిమాతో పాటు తెలుగులో వెంకీ కుడుముల అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ‘ఛలో’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ‘ఛలో’ సినిమాను నాగశౌర్య అమ్మనాన్నలు ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఫిబ్రవరి 2న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా థియట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. తెలుగు, తమిళ రాష్ట్రాల మధ్య ఉన్న ఓ ఊరి గొడవ నేపథ్యంలో ఎంటర్టైనింగ్ సినిమాను రూపొందించారు. నాగశౌర్య సరసన రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్నారు. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతమందిస్తున్నారు. -
‘ఛలో’ రిలీజ్ వాయిదా..!
ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన యంగ్ హీరో నాగశౌర్య ఇటీవల కాస్త స్లో అయ్యాడు. వరుసగా ఫెయిల్యూర్స్ పలకరిస్తుండటంతో సినిమాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ యువ కథానాయకుడు రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. తమిళ దర్శకుడు విజయ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ‘కణం’ సినిమాతో పాటు తెలుగు వెంకీ కుడుముల అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ‘ఛలో’ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ‘ఛలో’ సినిమాను నాగశౌర్య అమ్మనాన్నలు ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ముందుగా డిసెంబర్ 28న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ ను చిత్రయూనిట్ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట. ముందుగా అనుకున్నట్టుగా డిసెంబర్ లో కాకుండా ఫిబ్రవరి తొలి వారంలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతానికి రిలీజ్ వాయిదాపై ఎలాంటి ప్రకటన లేకపోయినా.. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతోంది. -
సాయిపల్లవి కణం ట్రైలర్ వచ్చేసింది
-
సాయిపల్లవి కొత్త ట్రైలర్ వచ్చేసింది
సాక్షి, సినిమా : టాలీవుడ్లో ప్రస్తుతం క్రేజీ బ్యూటీగా మారిపోయిన సాయిపల్లవి కొత్త చిత్రం ‘కణం’ ట్రైలర్ విడుదలయ్యింది. నాగ శౌర్య హీరోగా.. కోలీవుడ్ దర్శకుడు ఏఎల్ విజయ్(అభినేత్రి దర్శకుడు) ఈ చిత్రాన్ని రూపొందించాడు. వరుస హత్యలు, సూపర్ నేచురల్ థీమ్, హర్రర్... నేపథ్యాలతో ఈ చిత్రం తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే అర్థమౌతోంది. పెళ్లి చూపులు ఫేమ్ ప్రియదర్శి ఇందులో పోలీసాఫీసర్ రోల్లో కనిపించాడు. నాలుగేళ్ల ఓ చిన్నపాప చుట్టూ ఈ కథ తిరుగుతుందని గతంలోనే దర్శకుడు విజయ్ చెప్పాడు కూడా. తమిళ్లో ‘కరు’ పేరుతో ఏకకాలంలో ద్విభాషా చిత్రంగా ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ లైకా ప్రోడక్షన్ హౌజ్ నిర్మించింది. కాగా, కణం విడుదల తేదీపై త్వరలో ఓ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. -
దీపావళికి భయపెట్టే ‘కణం’
ఊహలు గుసగుసలాడే, కళ్యాణ వైభోగమే, జ్యో అచ్యుతానంద’ సినిమాలతో యువతలో మంచి పేరు తెచ్చుకున్న హీరో నాగశౌర్య. తెలుగులో నటించిన తొలి సినిమాతోనే ప్రేక్షకులను ‘ఫిదా’ చేసిన హీరోయిన్ సాయిపల్లవి. వీళ్లిద్దరూ జంటగా నటించిన సినిమా ‘కణం’. విజయ్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీపావళికి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘‘విభిన్న కథతో తెరకెక్కిన చిత్రమిది. రజనీకాంత్ హీరోగా భారీ బడ్జెట్‌తో మా సంస్థ నిర్మిస్తున్న ‘2.0’ సిన్మాకి సినిమాటోగ్రఫీ అందిస్తున్న నిరవ్‌షా ఈ ‘కణం’కి పని చేశారు’’ అని లైకా సంస్థ తెలిపింది. హారర్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందిందని సమాచారం. ‘పెళ్లిచూపులు’ ఫేమ్ ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎస్. ప్రేమ్. -
ప్రయోగాత్మక చిత్రంలో ఫిదా బ్యూటీ
ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయి పల్లవి సినిమాల సెలక్షన్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం నాని హీరోగా తెరకెక్కుతున్న ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ, మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ కు రెడీ అవుతోంది. తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కబోయే ప్రయోగాత్మక చిత్రం కణంలో లీడ్ రోల్ లో నటిస్తోంది సాయి పల్లవి. విక్రమ్ హీరోగా నాన్న లాంటి డిఫరెంట్ సినిమాను తెరకెక్కించిన ఎ. ఎల్ విజయ్ దర్శకత్వంలో 2.ఓ నిర్మాతలు లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. సాయి పల్లవి ఓ పాపతో కలిసి ఉన్న ఈ పోస్టర్ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. టైటిల్ డిజైన్ లోనూ తల్లి గర్భంలోని బిడ్డను చూపించటంతో ఈ సినిమా లేడి ఓరియంటెడ్ మూవీ అయి ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.