సాయిపల్లవి
‘‘కణం’ హారర్ సినిమా అనగానే ఫస్ట్ నో చెప్పా. విజయ్ గారు స్టోరీ పంపించారు. నేను చదవలేదు. అమ్మ చదివి, ఇలాంటి మంచి కథని ఎలా వదులుకుంటున్నావ్? అంది. అప్పుడు కథ పూర్తీగా చదివా. నచ్చడంతో ఓకే చెప్పా’’ అని సాయిపల్లవి అన్నారు. నాగశౌర్య, సాయిపల్లవి జంటగా ఎ.ఎల్. విజయ్ దర్శకత్వంలో ఎన్.వి.ఆర్. సినిమా సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ‘కణం’ ఈనెల 27న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సాయిపల్లవి పంచుకున్న చిత్ర విశేషాలు...
► ‘కణం’ కంటే ముందు కూడా హారర్ కథలు విన్నా. అయితే.. చేయలేనని వాళ్లతో డైరెక్ట్‌గా చెప్పలేదు. ఇంకో 2, 3 సినిమాల తర్వాత చేద్దామని చెప్పా. కానీ ‘కణం’ విషయంలో నో చెప్పినా తర్వాత ఎస్ చెప్పాను. లవర్‌గా, కూతురిగా యాక్ట్ చేయొచ్చు. కానీ, ఒక తల్లిగా నటించడం చాలా కష్టం. ప్రాక్టికల్‌గా నాకు అలాంటి ఎక్స్‌పీరియన్స్ లేదు కాబట్టి, చేయగలనా? అనిపించేది.
► ఈ సినిమా చేసేటప్పుడు వెరోనికాతో నిజంగానే ఒక తల్లిలా కనెక్ట్ అయిపోయా. ప్రతి పేరెంట్ ఈ సినిమాకి కనెక్ట్ అవుతారనడంలో అనుమానం లేదు. ఇలాంటి సినిమాలు ఇంకా చాలా రావాలి. ఈ స్టేజ్ ఆఫ్ కెరీర్‌లో తల్లిగా నటించాననే ఫీలింగ్ లేదు. తల్లిగా ఎప్పుడైతే చేయగలిగానో చాలా హ్యాపీ. ఇలాంటి పాత్రలు చేయడానికి ఏజ్‌తో, ఇమేజ్‌తో సంబంధం లేదు. ఎలా నటించామన్నదే ముఖ్యం.
► ‘ప్రేమమ్’ చిత్రానికి ముందు నేను జార్జియాలో ఉన్నప్పుడు మొటిమలు పోగొట్టుకోవడానికి చాలా చేసేదాన్ని. కానీ, అవి పోలేదు. అందుకే ‘ప్రేమమ్’ టైమ్‌లో కొంచెం భయపడ్డా. అందరూ నన్ను నాలా యాక్సెప్ట్ చేశారు. దాంతో నాకే కాదు.. అందరమ్మాయిలకు మంచి మెసేజ్ రీచ్ అయింది.
► ‘ప్రేమమ్, ‘ఫిదా, కణం’ చిత్రాల్లో నావి వేటికవే ప్రత్యేక పాత్రలు. ప్రస్తుతం నా ఆలోచన సినిమాల గురించే. డాక్టర్‌గా నా కెరీర్ బిగిన్ చేయాలనుకున్న రోజు సినిమాలు మానేస్తా. నాగశౌర్య గొప్ప నటుడు. ఈ చిత్రంలో కొన్ని సీక్వెన్సెస్‌లో తను ఇచ్చిన హావభావాలు ఇంటికెళ్లాక ట్రై చేసేదాన్ని.
Comments
Please login to add a commentAdd a comment