Sai Pallavi's Kanam Movie is Raja Kumaran's Story? - Sakshi
Sakshi News home page

Published Tue, May 1 2018 10:24 AM | Last Updated on Wed, May 2 2018 11:56 AM

Sai Pallavi Kanam in Copy Controversy - Sakshi

కణంలో సాయి పల్లవి

ఫిదా బ్యూటీ సాయి పల్లవి తాజా చిత్రం కణం(తమిళంలో దియా) వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రం కథ తనదేనంటూ ఓ వ్యక్తి చిత్ర యూనిట్‌పై ఆరోపణలు చేస్తున్నాడు. కోలీవుడ్‌లో పలు చిత్రాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేసిన చంద్రకుమార్‌ తన కథను కణం యూనిట్‌ కాపీ కొట్టారంటూ నడిగర్‌ సంఘంలో ఫిర్యాదు చేశాడు. హీరోయిన్‌ అబార్షన్‌.. ఆమె కుటుంబం మిస్టరీగా చనిపోవటం లాంటి నేపథ్యం అంతా తన కథలోదేనని.. దియా(కణం) రచయిత రాజకుమారన్‌ తన కథను కాపీ కొట్టారంటూ చంద్ర ఆరోపిస్తున్నాడు. ఇప్పటికే డివైడ్‌ టాక్‌తో థియేటర్లో నడుస్తున్న ఈ చిత్రాన్ని.. ఈ వివాదం మరిన్ని కష్టాల్లోకి నెట్టేసింది. ఈ వివాదంపై స్పందించేందుకు నిర్మాతలు నిరాకరిస్తున్నారు. నాగశౌర్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ థ్రిల్లర్‌ మూవీకి ఏఎల్‌ విజయ్‌ దర్శకుడు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement