copying issue
-
Viral Video: ఓరిని తెలివి సల్లగుండా.. పరీక్షల్లో ఇలా కూడా కాపీ కొడతారా!
చండీగఢ్: కొందరు విద్యార్థులు చదవడంలో చూపించని శ్రద్ధ.. పరీక్షలో కాపీ కొట్టే సమయంలో బాగా ప్రదర్శిస్తారు. చీటింగ్ చేసేందుకు ఉన్న అన్ని రకాల పద్దతులను ప్రయత్నిస్తుంటారు. అభివృద్ధి చెందిన టెక్నాలజీని సైతం కాపీ కొట్టడంలో తెగ వాడేస్తుంటారు. చిట్టిలు పట్టుకెళ్తే దొరికిపోతామని భావించి.. స్మార్ట్ వాచ్‌లు, బ్లూటూత్, మొబైల్స్ ద్వారా కూడా మాస్ కాపింగ్‌కు పాల్పడే అపర మేధావులున్నారు. తాజాగా ఓ పదో తరగతి విద్యార్థి హై లెవల్లో కాపింగ్‌కు పాల్పడి అధికారులకు అడ్డంగా బుక్కయ్యాడు.. హార్యానాలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఫతేహాబాద్లో ఓ విద్యార్థి చీటింగ్ పాల్పడ్డాడు. ఇంగ్లీష్ పరీక్ష రోజున గ్లాస్ క్లిప్‌బోర్డును ఉపయోగించాడు. అందులో రహస్యంగా అమర్చిన మొబైలోని కొన్ని యాప్స్, వాట్సాప్ ఉంది. వీటిలో సబ్జెక్టుకు సంబంధించిన కంటెంట్‌ను భద్రపరుచుకున్నాడు. దీని ద్వారా పరీక్షల్లో చూసి రాస్తున్నాడు. అయితే పాపం విద్యార్థి తెలివి తేటలు అధికారులకు తెలిసిపోయాయి. గమనించిన ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి విద్యార్థిని పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేశారు. One of the examinees got a smartphone fitted in the clipboard for cheating in exam at an examination centre in Fatehabad district of #Haryana in the Board examination being conducted by the Board of School Education. The flying squad detected use of unfair means. @thetribunechd pic.twitter.com/aCXejWV1Sa — Deepender Deswal (@deependerdeswal) April 5, 2022 ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని జర్నలిస్ట్ దీపేందర్ దేశ్వాల్ షేర్ చేశారు. ‘బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నిర్వహిస్తున్న పరీక్షలో ఫతేబాద్ హార్యానాలోని జిల్లాలో ఒక పరీక్షా కేంద్రంలో ఓ విద్యార్థి క్లిప్‌బోర్డ్‌లో స్మార్ట్‌ఫోన్‌ను అమర్చి కాపియింగ్ పాల్పడ్డాడు. దీనిని ఫ్లయింగ్ స్క్వాడ్ గుర్తించారు’. అని పేర్కొన్నారు. కాగా ఇంగ్లీష్ పరీక్ష రోజు సుమారు 457 మంది విద్యార్థులు మోసాలకు పాల్పడ్డారు. భువా పరీక్షా కేంద్రంలో పదో తరగతి విద్యార్థి కార్పెట్ కింద దాచిన మొబైల్ ఫోన్‌ను స్కాడ్ సిబ్బంది గుర్తించారు. అలాగే బిర్దానా పరీక్షా కేంద్రంలో ఒక విద్యార్థి ప్యాంట్లో, మరో విద్యార్థిని షర్ట్‌లో ఉన్న చీటీలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. -
ఆ పాట కాపీనా? మ్యూజిక్ డైరెక్టర్ని ఆడేసుకుంటున్న నెటిజన్లు
సినిమా ఇండస్ట్రీలో కాపీల వివాదాలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. స్టోరీ, పోస్టర్లు, మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇలా చాలా విషయాల్లో ఇతర సినిమా నుంచి కాపీ కొట్టారనే ఆరోపణలు అనేక సందర్భంలో రచ్చకెక్కుతున్నాయి. ముఖ్యంగా మ్యూజిక్ విషయంలో కాపీల వివాదాలు కోకొల్లలుగా పుడుతున్నాయి. తెలుగు నుంచి బాలీవుడ్, హాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ విషయంలోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. తాజాగా బాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనుమాలిక్ సినిమాలోని పాటపై వివాదం చుట్టుముట్టింది. అనుమాలిక్ సంగీతం అందించిన దిల్జాలే సినిమా బాలీవుడ్లో 1996లో విడుదలైంది. ఇందులో ‘మేరా ముల్క్ మేరా దేశ్’ అనే పాట ఉన్న విషయం గుర్తుండే ఉంటుంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ.. టోక్యో ఒలింపిక్స్‌లో ఇజ్రాయిల్ జిమ్నాస్ట్ అర్టెమ్ డోల్గోప్యాట్ రెండోసారి స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకున్న తర్వత వారి జాతీయ గీతం హత్వికాను ప్లే చేశారు. ఇది విన్న భారత నెటిజన్లు అప్పటి నుంచి అనుమాలిక్‌ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఇజ్రాయిల్ జాతీయ గీతం హతిక్వా, అను ముల్క్ మేరా దేశ్ పాటకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఇజ్రాయిల్ జాతీయ గీతాన్ని దొంగిలించి తన చిత్రంలో ఉపయోగించుకున్నాడని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వేలాది మంది వరుస ట్వీట్లు చేస్తూ అను మాలిక్ పేరును ట్విటర్ ట్రెండింగ్‌లో నిలిపారు. నెటిజన్లు కామెంట్లు ఇలా ఉన్నాయి. ‘అను మాలిక్ తమ పాటను కాపీ కొట్టారని ఒలంపిక్ గోల్డ్ తెలుసుకునేందుకు 25 ఏళ్లు పట్టింది. 1996 లోని దిల్జాలేలోని మేరా ముల్క్ మేరా దేశ్ పాట ట్యూన్ కాపీ చేస్తున్నప్పుడు అను మాలిక్ ఇజ్రాయెల్ జాతీయ గీతాన్ని కూడా వదిలిపెట్టలేదు. ఇంటర్నెట్కు ధన్యవాదాలు., ఇది ఇప్పుడైనా మనకు తెలిసింది. బాలీవుడ్ ఇజ్రాయిల్ జాతీయ గీతాన్ని కాపీ కొట్టింది.. ఇది నెక్స్ట్ లెవల్.. అనుమాలిక్ ఎంతో కచ్చితంగా ఉన్నాడు. ఇజ్రాయిల్ ఎప్పటికీ గోల్డ్ మెడల్ సాధించదని, ఇక తన దొంగతనం బయటపడదని’ అంటూ సంగీత దర్శకుడిని ఓ ఆట ఆడుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ విషయంపై మాలిక్ స్పందించలేదు. So Anu Malik didn’t spare even Israeli national anthem while copying tune for Diljale’s Mera Mulk Mera Desh in 1996 Thanks to internet we now know thispic.twitter.com/LtQMyU5dp2 — Monica (@TrulyMonica) August 1, 2021 It took 25 years and Olympic gold 🥇 to realise That Anu Malik copy "Mera Mulk Mera Desh"😅😅😅😅😅😅 https://t.co/Nrgd3uokSM — ₭₳฿łⱤ ₱₳₮ɆⱠ (@kabeerbackup) August 1, 2021 Bollywood copied Israel's national anthem tune, this is next level ..... Anu Malik !! 😂 https://t.co/bZ0VUjJ0dG — Veer Phogat (@VeerPhogat1) August 1, 2021 Anu Malik had confidence Israel will never win a gold and his robbery will remain hidden 😭 https://t.co/PJQClHAJHx — Straight Cut (@StraightCut_) August 1, 2021 No it is not just you. 100% true. I can't get over it. Anu Malik actually copied the Israeli national anthem for one of his songs! Utha le re baba 😂😂 WDTT https://t.co/GvXdvlusyu — Anand Ranganathan (@ARanganathan72) August 1, 2021 -
చిక్కుల్లో సాయి పల్లవి సినిమా?
ఫిదా బ్యూటీ సాయి పల్లవి తాజా చిత్రం కణం(తమిళంలో దియా) వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రం కథ తనదేనంటూ ఓ వ్యక్తి చిత్ర యూనిట్‌పై ఆరోపణలు చేస్తున్నాడు. కోలీవుడ్‌లో పలు చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన చంద్రకుమార్ తన కథను కణం యూనిట్ కాపీ కొట్టారంటూ నడిగర్ సంఘంలో ఫిర్యాదు చేశాడు. హీరోయిన్ అబార్షన్.. ఆమె కుటుంబం మిస్టరీగా చనిపోవటం లాంటి నేపథ్యం అంతా తన కథలోదేనని.. దియా(కణం) రచయిత రాజకుమారన్ తన కథను కాపీ కొట్టారంటూ చంద్ర ఆరోపిస్తున్నాడు. ఇప్పటికే డివైడ్ టాక్‌తో థియేటర్లో నడుస్తున్న ఈ చిత్రాన్ని.. ఈ వివాదం మరిన్ని కష్టాల్లోకి నెట్టేసింది. ఈ వివాదంపై స్పందించేందుకు నిర్మాతలు నిరాకరిస్తున్నారు. నాగశౌర్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ థ్రిల్లర్ మూవీకి ఏఎల్ విజయ్ దర్శకుడు. -
చూచిరాతలతో విద్యావ్యవస్థ నాశనం
సాక్షి, హైదరాబాద్: పరీక్షల్లో చూచిరాతల వల్ల విద్యావ్యవస్థ నాశనమవుతోందని హై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తల్లిదండ్రులు తమ పిల్లలకు 90% మార్కులు రావాలని కోరుకుంటున్నారని, అవి ఎలా వచ్చినా ఫర్వాలేదనే ధోరణితో ఉన్నారని పేర్కొంది. కాపీ కొట్టి రాశారా? చదివి రాశారా? అనేది పట్టించుకోవడం లేదని, ఇది ఎంత మాత్రం హర్షణీయం కాదంది. ‘జ్ఞానంతో పనిలేకుండా మార్కులు వస్తే చాలనుకుంటున్నారు. తల్లిదండ్రులుగా బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నామా? పిల్లలు చూసి రాస్తే టీచర్లపై (ఇన్విజిలేటర్లు) క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. అప్పుడే పరిస్థితిలో మార్పు వస్తుంది. ఎక్కడో ఓచోట కఠిన చర్యలు ప్రారంభించాలి. మాస్ కాపీ యింగ్‌కు జిల్లా విద్యాశాఖ అధికారులు, ముఖ్య కార్యదర్శులను వ్యక్తిగతంగా బాధ్యు లుగా చేస్తే సరైన ఫలితం ఉంటుంది’ అని హైకోర్టు స్పష్టం చేసింది. సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, బాధ్యు లైన అధికారులపై తీసుకుంటున్న చర్యలను వివరించాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ మంతోజ్ గంగారావుతో కూడిన ధర్మాసనం మంగళ వారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మాస్ కాపీయింగ్, పుస్తకాలు చూసి రాయటాన్ని నిరోధించటంలో విద్యాశాఖ విఫలమైందని ఏలూరుకు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్ గుంటుపల్లి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. పదో తరగతి పరీక్షల సందర్భంగా 405 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ తెలిపారు. మున్నాభాయ్‌లు తయారవుతున్నారు... ఈ సమయంలో పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ మాస్ కాపీయింగ్‌ను ప్రభు త్వాలు సీరియస్‌గా తీసుకోవడం లేదని, సీసీ కెమెరాలున్నా వాటికి చిక్కకుండా కొన్ని పాఠశాలలు ఉత్తీర్ణత శాతం పెంచుకోవడానికి విద్యార్థులకు జవాబులు చెబుతున్నాయ న్నారు. వీటిని కట్టడి చేయడంలో ప్రభు త్వాలు విఫలమవుతున్నాయని, తద్వారా మున్నాభాయ్‌లు తయారవుతున్నారని చెప్పారు. బాధ్యులను ప్రాసిక్యూషన్ చేసిన సందర్భాలు లేవన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ... టీచర్లు, విద్యార్థులు కుమ్మక్కవుతుంటే ప్రభుత్వాలు ఎంత వరకు కట్టడి చేయగలుగుతాయని ప్రశ్నించింది. సీసీ కెమెరాల ఏర్పాటే పరిష్కారం కాదని, అంతకు మించి ఏదైనా జరగాల్సి ఉందని తెలిపింది. చూచిరాతలు మన విద్యావ్యవస్థను నాశనం చేస్తున్నాయని, దీనికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని పేర్కొంది. ఇన్విజిలేటర్లకు సర్క్యులర్లు ఇస్తాం... మాస్ కాపీయింగ్ జరిగితే క్రిమినల్ కేసులతో పాటు ప్రాసిక్యూషన్ చేస్తామని ఇన్విజిలేటర్లందరికీ సర్కులర్లు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజయ్‌కుమార్ తెలిపారు. తదుపరి విచారణ నాటికి సర్కులర్‌ను కోర్టుకు సమర్పిస్తామని నివేదించారు. -
ఇన్విజిలేటర్ పట్టుకున్నారని.. ఆత్మహత్య
-
ఇన్విజిలేటర్ పట్టుకున్నారని.. ఆత్మహత్య
అందరిముందు ఇన్విజిలేటర్ తనను పట్టుకుని, చెక్ చేశారన్న ఆవేదనతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన విజయవాడలో జరిగింది. విజయవాడలో బీఎస్సీ ఫైనలియర్ చదువుతున్న మణికంఠ అనే ఈ విద్యార్థి మాస్ కాపీయింగ్ చేస్తూ పట్టుబడినట్లు కళాశాల వర్గాలు చెబుతున్నాయి. అయితే, కేవలం మానసికంగా తీవ్రంగా వేధించడం వల్ల మాత్రమే మణికంఠ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇన్విజిలేటర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ ఆందోళన చేస్తున్నారు. మణికంఠ కుటుంబాన్ని నైతికంగా, ఆర్థికంగా ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. కాగా, తమ కుమారుడిది చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్య చేసుకునే మనస్తత్వం కాదని, దీని వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుదని అతడి తల్లిదండ్రులు అన్నట్లు కూడా చెబుతున్నారు.