
ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన యంగ్ హీరో నాగశౌర్య ఇటీవల కాస్త స్లో అయ్యాడు. వరుసగా ఫెయిల్యూర్స్ పలకరిస్తుండటంతో సినిమాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ యువ కథానాయకుడు రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. తమిళ దర్శకుడు విజయ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ‘కణం’ సినిమాతో పాటు తెలుగు వెంకీ కుడుముల అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ‘ఛలో’ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.
‘ఛలో’ సినిమాను నాగశౌర్య అమ్మనాన్నలు ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ముందుగా డిసెంబర్ 28న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ ను చిత్రయూనిట్ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట. ముందుగా అనుకున్నట్టుగా డిసెంబర్ లో కాకుండా ఫిబ్రవరి తొలి వారంలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతానికి రిలీజ్ వాయిదాపై ఎలాంటి ప్రకటన లేకపోయినా.. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment