సాయిపల్లవి కొత్త ట్రైలర్‌ వచ్చేసింది | Sai Pallavi Kanam Trailer Out | Sakshi
Sakshi News home page

కణం ట్రైలర్‌ విడుదల

Published Sat, Nov 18 2017 8:04 PM | Last Updated on Sat, Nov 18 2017 8:24 PM

Sai Pallavi Kanam Trailer Out - Sakshi - Sakshi

సాక్షి, సినిమా : టాలీవుడ్‌లో ప్రస్తుతం క్రేజీ బ్యూటీగా మారిపోయిన సాయిపల్లవి కొత్త చిత్రం ‘కణం’ ట్రైలర్‌ విడుదలయ్యింది. నాగ శౌర్య హీరోగా.. కోలీవుడ్ దర్శకుడు ఏఎల్‌ విజయ్‌(అభినేత్రి దర్శకుడు) ఈ చిత్రాన్ని రూపొందించాడు.

వరుస హత్యలు, సూపర్ నేచురల్ థీమ్‌, హర్రర్‌... నేపథ్యాలతో ఈ చిత్రం తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే అర్థమౌతోంది. పెళ్లి చూపులు ఫేమ్‌ ప్రియదర్శి ఇందులో పోలీసాఫీసర్‌ రోల్‌లో కనిపించాడు. నాలుగేళ్ల ఓ చిన్నపాప చుట్టూ ఈ కథ తిరుగుతుందని గతంలోనే దర్శకుడు విజయ్‌ చెప్పాడు కూడా.

తమిళ్‌లో ‘కరు’ పేరుతో ఏకకాలంలో ద్విభాషా చిత్రంగా ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ లైకా ప్రోడక్షన్‌ హౌజ్‌ నిర్మించింది. కాగా, కణం విడుదల తేదీపై త్వరలో ఓ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement