
ఫిదా మొదలైంది
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ స్పీడు పెంచాడు. కెరీర్ స్టార్టింగ్లో సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ డిఫరెంట్ అనిపించుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు మాస్ ఇమేజ్ కోసం, కమర్షియల్ ట్యాగ్ కోసం ఊవ్విళ్లూరుతున్నాడు. అందుకే పూరి జగన్నాథ్ లాంటి మాస్ స్సెషలిస్ట్తో లోఫర్ సినిమా చేసి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఒకేసారి క్లాస్, మాస్ బ్యాలెన్స్ చేస్తూ రెండు సినిమాలను రెడీ చేస్తున్నాడు.
ఒక సినిమా పూర్తయితే గాని మరో సినిమా గురించి ఆలోచించని ఈ జనరేషన్లో, ఒకే సమయంలో రెండు సినిమాల షూటింగ్లో పాల్గొంటున్నాడు వరుణ్. ఇప్పటికే శ్రీనువైట్ల దర్శకత్వంలో మిస్టర్ సినిమా షూటింగ్ ప్రారంభించిన ఈ టాల్ హీరో మొదటి షెడ్యూల్ పూర్తి చేసేశాడు. ఇక శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కుతున్న మరో సినిమా ఫిదా షూటింగ్ను కూడా మొదలెట్టేశాడు.
ఒకే సమయంలో శ్రీనువైట్ల లాంటి మాస్ డైరెక్టర్తో, శేఖర్ కమ్ముల లాంటి క్లాస్ డైరెక్టర్తో సినిమాలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఈ రెండు సినిమాలతో మంచి విజయాలు సాధించి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోవాలని భావిస్తున్నాడు వరుణ్ తేజ్.