
తన డ్యాన్సులతో, యాక్టింగ్‌తో సాయి పల్లవి అందర్నీ కట్టిపడేస్తూ ఉంటుంది. సాయి పల్లవి వీడియో సాంగ్‌లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయన్న సంగతి తెలిసిందే. ఫిదాలోని ‘వచ్చిండే’ సాంగ్ ఒకప్పుడు రికార్డులు సృష్టిస్తే.. ప్రస్తుతం ‘రౌడీ బేబీ’ సాంగ్ యూట్యూబ్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
మొన్నటి వరకు సౌత్ ఇండియాలో అత్యధిక మంది వీక్షించిన వీడియో సాంగ్‌గా టాప్‌లో నిలిచిన వచ్చిండే సాంగ్‌ను చాలా తక్కువ టైమ్‌లో రౌడీ బేబీ వెనక్కి నెట్టేసింది. రెండింట్లోనూ సాయి పల్లవి తన మార్క్‌తో అలరించింది. వచ్చిండే సాంగ్‌తో ట్రెండ్‌సెట్ చేసిన సాయి పల్లవి.. రౌడీ బేబీతో తన రికార్డును తానే బద్దలుకొట్టింది. ఇప్పటికీ రౌడీ బేబీ వీడియోసాంగ్‌ను 183మిలియన్ల (దాదాపు 18కోట్లు) మంది వీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment