భానుమతి భయపెడుతుందా..?
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నేచురల్ బ్యూటి సాయి పల్లవి. తొలి సినిమాతో స్టార్ స్టేటస్ అందుకున్న ఈ భామ, టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారుతోంది. తెలుగుతో పాటు మలయాళ ఇండస్ట్రీలోనూ సినిమాలు చేస్తున్ సాయి పల్లవి, కథల ఎంపికలో చాలా సెలెక్టివ్ గా ఉంటుందట. కథ నచ్చకపోతే ఎంత రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినా నో చెప్పేస్తోంది.
అయితే తాజాగా ఈ భామ ఓ ఇంట్రస్టింగ్ సినిమాకు ఓకె చెప్పిందన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో నాని హీరోగా తెరకెక్కుతున్న ఎంసీఏ సినిమాలో నటిస్తున్న సాయి పల్లవి, థ్రిల్లర్ సినిమాలో నటించేందుకు అంగీకరించిందన్న టాక్ వినిపిస్తోంది. సౌత్ లో వరుస సినిమాలతో దూసుకుపోతుండటంతో లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ ఒకేసారి రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.