ఆన్ లైన్ లోనూ ఫిదా చేస్తోంది..! | Fidaa video songs youtube Record | Sakshi
Sakshi News home page

ఆన్ లైన్ లోనూ ఫిదా చేస్తోంది..!

Published Sun, Sep 24 2017 12:22 PM | Last Updated on Sun, Sep 24 2017 2:34 PM

Fidaa video songs youtube Record

మెగా హీరో వరుణ్ తేజ్, మల్లార్ బ్యూటీ సాయి పల్లవి హీరో హీరోయిన్లు గా నటించిన చిత్రం ఫిదా. ఘనవిజయం సాధించిన ఈ సినిమా బడ్జెట్ కు మించి ఎన్నో రెట్లు కలెక్ట్ చేసిన భారీ రికార్డులు నమోదు చేసింది.   చాలా కాలం తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా, వరుణ్ తేజ్ కు మంచి కమర్షియల్ సక్సెస్ ఇచ్చింది. సినిమా రిలీజ్ అయి 50 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు అదే మూడ్ లో ఉన్నారు.

తాజాగా ఈ సినిమా వీడియో సాంగ్స్ ను యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. వీటిలో హేయ్ పిల్లగాడా పాట విడుదల చేసిన 24 గంటల్లోనే పది లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. మెల్ల మెల్లగా వచ్చిండే అనే మరో పాటు 8 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. సినిమా రిలీజ్ అయి 50 రోజులు దాటిన తరువాత కూడా ఈ స్థాయిలో వ్యూస్ సాధించటంతో యూనిట్ సభ్యులు ఖుషీ అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement