సూర్య జోడిగా మల్లార్ బ్యూటీ | Sai Pallavi opposite Suriya in Selvaraghavan film | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 20 2017 10:36 AM | Last Updated on Wed, Dec 20 2017 10:36 AM

Sai Pallavi opposite Suriya in Selvaraghavan film - Sakshi

తమిళ సినిమా: కోరికలు అంత ఈజీగా నెరవేరవు. ఒక వేళ అలా జరిగితే అంతకంటే అదృష్టం ఉండదు. అయితే అనుకోకుండానే అందలం ఎక్కేసిన నటి సాయిపల్లవి. మలయాళంలో ప్రేమమ్‌ చిత్రంలో మలర్‌ టీచర్‌గా నటించి ఒక్క కేరళ ప్రేక్షకులనే కాకుండా ఇరుగు, పొరుగు రాష్ట్రాలు తమిళనాడు, ఆంధ్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతే తెలుగులో ఫిదా చిత్రంతో ప్రేక్షకుల మనసుల్సి కొల్లగొట్టేసిన సాయిపల్లవి టాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందింది. త్వరలో కరు చిత్రంతో కోలీవుడ్‌ ప్రేక్షకుల మదిని దోచుకోవడానికి సిద్ధం అవుతోంది.

అయితే ఆ చిత్రం విడుదలకు ముందే మరో భారీ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుందన్నది తాజా సమాచారం. ఈ అమ్మడింతకు ముందొక భేటీలో తనకు నటుడు సూర్య అంటే చాలా ఇష్టం అని, ఆయనతో నటించే అవకాశం వస్తే వదులుకునేది లేదని వెల్లడించింది. అయితే అలాంటి అవకాశం ఇంత తొందరగా వస్తుందని బహూశ సాయిపల్లవి ఊహించి ఉండదు. అలాంటి తన కోరిక తీరే తరుణం వచ్చేసింది. 

సూర్య తాజాగా తానా సేర్న్‌దకూట్టం చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. నటి కీర్తీసురేశ్‌ నాయకిగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ పూర్తి అయ్యింది. సంక్రాంతికి ఆయన అభిమానులకు కానుకగా విడుదలకు ముస్తాబవుతోంది. ఇక సూర్య తదుపరి చిత్రానికి రెడీ అయిపోతున్నారు. దర్శకుడు సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో నటించనున్నట్లు ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు సూర్య. ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్‌ప్రీత్‌సింగ్‌ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ఏమిటంటే ఇందులో మరో నాయకిగా సాయిపల్లవి నటించనుంది.

ఈ విషయమై దర్శకుడు సెల్వరాఘవన్‌  ఇప్పటికే సాయిపల్లవితో చర్చలు జరిపారని, తనూ నటించడానికి అంగీకరించిందని కోలీవుడ్‌ వర్గాల సమాచారం. డ్రీమ్‌ వారియర్‌ ఫిలిం స్‌ సంస్థ నిర్మించనున్న ఈ భారీ చిత్రం జనవరి రెండవ భాగంలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం సెల్వరాఘవన్‌ సంతానం హీరోగా మన్నవన్‌ వందానడి చిత్రాన్ని పూర్తి చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement