మరో స్టార్ వారసుడితో తేజ..?
రానా హీరోగా తెరకెక్కిన నేనే రాజు నేనే మంత్రి సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన స్టార్ డైరెక్టర్ తేజ, మరో ఇంట్రస్టింగ్ సినిమాకు రెడీ అవుతున్నారట. తన కెరీర్ లో ఎక్కువగా కొత్త నటీనటులతోనే విజయాలు సాధించిన తేజ, స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలతో సినిమాలు చేసిన ప్రతీ సారి ఫెయిల్ అయ్యారు. దీంతో లాంగ్ గ్యాప్ తరువాత రానా లాంటి స్టార్ తో సినిమా చేసి మెప్పించిన ఈ క్రియేటివ్ డైరెక్టర్ మరోసారి స్టార్ వారసుడి మీద దృష్టి పెట్టారు.
ఈ సారి మెగా క్యాంప్ మీద కన్నేసిన తేజ, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఫిదా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన వరుణ్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. తేజ కథా కథనాలు రెడీ చేయడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది.
వెంకీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పూర్తయిన తరువాత షార్ట్ గ్యాప్ తీసుకొని తేజ సినిమాకు రెడీ అవ్వనున్నారు వరుణ్. ప్రస్తుతానికి ఈ కాంబినేషన్ పై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా.. తేజ లాంటి దర్శకుడితో సినిమా చేస్తే వరుణ్ కు లవర్ భాయ్ మరింత స్ట్రాంగ్ ఇమేజ్ వస్తుందని భావిస్తున్నారు ఫ్యాన్స్.