Theme Poster
-
అలల కంటే మొండివాడిని.. మరి మీరూ?!
‘ఆర్ఎక్స్ 100’తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఇటీవల శర్వానంద్, హీరో సిద్దార్థ్‌లతో మల్లీస్టార్ చిత్రం ‘మహాసముద్రం’ తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ థీమ్ పోస్టర్‌ను హీరో శర్వానంద్ దీపావళి సందర్భంగా విడుదల చేశాడు. ఎకే ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యూయేల్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. దీపావళి పండగ సందర్భంగా ఈ సినిమా థీమ్ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ థీమ్ పోస్టర్‌ను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ... ‘సముద్రం అంతా లోతు, అలల కంటే మొండివాడిని.. అంటూ తన సహా నటులైన సిద్దార్థ్‌తో పాటు హీరోయిన్స్ అదితి రావ్, అను ఇమ్మాన్యూమేల్‌లను ట్యాగ్ చేసి మరీ మీరు ఎవరూ అని ప్రశ్నించాడు. అంతేగాక దర్శకుడు అజయ్ భూపతి, నిర్మాతలను ట్యాగ్ చేసి ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు. (చదవండి: షేక్ చేస్తున్న శర్వానంద్ ‘భలేగుంది బాలా’ సాంగ్) I'm stubborn than the waves, deep as the seas! @aditiraohydari @Actor_Siddharth @ItsAnuEmmanuel Who are you? #MahaSamudram #ThemePoster 🌊 #HappyDiwali 🪔@DirAjayBhupathi @AnilSunkara1 @AKentsOfficial pic.twitter.com/MGHfjfaFb8 — Sharwanand (@ImSharwanand) November 14, 2020 కాగా అజయ్ భూపతి మొదటిసారిగా దర్శకత్వం వహించిన రొమాంటిక్ చిత్రం ‘ఆర్ఎక్స్ 100’ బ్లాక్‌బ్లస్టర్ హిట్ కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై భారీగానే అంచనాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎర్రటి ఆకాశం, సముద్రం బ్యాక్‌గ్రౌండ్‌లో బ్రిడ్జికి అవతలవైపు ఓ వ్యక్తి పరుగులు తీస్తూ, ఇవతల బ్రిడ్జిపై ఇద్దరూ మనుషులు గన్‌పై నిలుచున్నట్లుగా ఉండి పరుగెడుతున్న వ్యక్తి వైపు గురిపెడుతున్న ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇక పొస్టర్‌కు కింద ‘అమితమైన ప్రేమ’ అనే ట్యాగ్ లైన్ ఉండటం చూసి ‘సముద్రం’ రోమాంటిక్, థ్రీల్లర్ నేపథ్యంలో సాగనుందని, దర్శకుడు ఈ సినిమాను ఓరెంజ్‌లో చూపించబోతున్నాడంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక దాదాపు ఏడేళ్ల తర్వాత ‘బొమ్మరిల్లు’ హీరో సిద్దార్థ్ తెలుగు రీఎంట్రీ ఇవ్వడంలో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం ప్రస్తుతం విశాఖపట్నంలో షూటింగ్ జరుపుకుంటోంది. (చదవండి: టాలీవుడ్లో కొత్త జోడి.. సాయి కాదు అదితి) -
`ఈ కథలో పాత్రలు కల్పితం` థీమ్ పోస్టర్
పవన్ తేజ్ కొణిదెల హీరోగా, మేఘన, లక్కీ హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. అభిరామ్ ఎం. దర్శకత్వం వహిస్తున్నారు. మాధవి సమర్పణలో ఎంవీటీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజేష్ నాయుడు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకుల నుంచి పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ తుదిదశకు చేరుకున్న ఈ చిత్ర థీమ్ పోస్టర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్మాత రాజేష్ నాయుడు మాట్లాడుతూ.. ‘సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇప్పటివరకు చిత్రీకరించిన వరకు ఔట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. టైటిల్ అనౌన్స్ చేసినప్పటినుండి మా సినిమాకి పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. మా హీరో పవన్ తేజ్ కొణిదెలకి ఒక పర్ఫెక్ట్ లాంచింగ్ మూవీ అవుతుంది. దర్శకుడు అభిరామ్ మంచి విజన్ తో అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టునే థ్రిల్లింగ్ అంశాలతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 'జెస్సీ', రీసెంట్ గా వచ్చిన ' ఓ పిట్టకథ ' సినిమాలకి వర్క్ చేసిన సినిమాటోగ్రాఫర్ సునీల్ కుమార్ విజువల్స్, 'ఆర్ఎక్స్ 100', 'కల్కి' చిత్రాలకు డైలాగ్స్ రాసిన తాజుద్దీన్ సయ్యద్ మాటలు ఈ చిత్రానికి హైలెట్ గా నిలవనున్నాయి. చివరి షెడ్యూల్ పూర్తి అవగానే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరిపి విడుదల తేదీని ప్రకటిస్తాం. త్వరలోనే టీజర్, పాటలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని అన్నారు. కార్తీక్ కొడకండ్ల సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజన్ పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. చదవండి: నా భర్త ఎక్కడో గొయ్యి తవ్వుతున్నాడు : సమంత దానవ మానవుల పాతాళ్ లోక్ -
ప్రేమ.. ద్వేషం... ఓ ప్రేమకథ
‘‘సంవత్సరం ముందే శేఖర్ కమ్ముల నాకీ లైన్ చెప్పారు. స్క్రిప్ట్ రెడీ అయ్యాక చదివాను. చాలా నచ్చింది. ‘కంచె’ సినిమాలో వరుణ్‌తేజ్ పర్ఫార్మెన్స్ బాగుంది. ఈ సినిమాకు వరుణ్ తేజ్‌ను హీరోగా తీసుకుందామని శేఖర్ చెప్పారు. సాయి పల్లవి నటించిన మలయాళ ‘ప్రేమమ్’ సూపర్ హిట్. వరుణ్‌తేజ్, సాయిపల్లవి జోడి ఈ సినిమా 50 శాతం సక్సెస్ కావడానికి ఉపయోగపడుతుంది’’ అని ‘దిల్’ రాజు అన్నారు. వరుణ్ తేజ్, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న ‘ఫిదా’ శుక్రవారం నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో ప్రారంభమైంది. ‘లవ్- హేట్- లవ్‌స్టోరీ’ అనేది ఉపశీర్షిక. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ చిత్రవిశేషాలను ‘దిల్’ రాజు చెబుతూ - ‘‘తెలంగాణ ప్రాంతానికి చెందిన అమ్మాయితో అమెరికా అబ్బాయి ప్రేమలో పడతాడు. కథానాయిక తెలంగాణాలోని ఒక గ్రామీణ ప్రాంతానికి చెందిన యువతి కావడంతో ఆ రాష్ట్రంలోని బాన్సువాడను ఎంపిక చేశాం. బాన్సువాడాలో 45 రోజులు, అమెరికాలో మరో 45 రోజులు షూటింగ్ జరుపుతాం’’ అన్నారు. నటుడు నాగేంద్రబాబు, చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల, నటి సాయి పల్లవి తదితరులు పాల్గొన్నారు. -
'ఫిదా' థీమ్ పోస్టర్ రిలీజ్
మంచి కాఫీలాంటి సినిమాల క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, మెగా హీరో వరుణ్ తేజ్‌ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రానికి టైటిల్ ఖరారైంది. లవ్.. హేట్.. లవ్ స్టోరీ కాన్సెప్ట్‌గా 'ఫిదా' అనే పేరుతో కూల్ యూత్‌ఫుల్ ఎంటర్టెయినర్ని నిర్మించనున్నారు. శుక్రవారం ఫిదా థీమ్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. పోస్టర్‌ను వరుణ్ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశాడు. మలయాళ 'ప్రేమమ్' ఫేం సాయి పల్లవి వరుణ్ సరసన నటిస్తుంది. హిందీలో హిట్ అయిన కహానీకి రీమేక్‌గా నయనతార ప్రధాన పాత్రలో శేఖర్ కమ్ముల తీసిన సినిమా 'అనామిక' తడబడటంతో.. రెండేళ్ల గ్యాప్ తరువాత మొదలుపెట్టిన ఈ ప్రాజెక్ట్ ఆయన కెరీర్‌కు కీలకం కానుంది. కంచె, లోఫర్ సినిమాలతో నటుడిగా ఇప్పటికే ప్రేక్షకులను మెప్పించిన వరుణ్.. శేఖర్ మార్క్ హీరోగా అలరించేందుకు సిద్ధమయ్యాడు. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న 'ఫిదా'పై అభిమానుల్లో అప్పుడే ఆసక్తి మొదలయ్యింది. Here you go!..the theme poster of my next with Shekar Kamulla #Fidaa #LoveHateLoveStory pic.twitter.com/GHdcoqLcLB — Varun Tej (@IAmVarunTej) 5 August 2016