
‘ఆకాశం నీ హద్దురా’లో... ; ‘వాడీవాసల్’ పోస్టర్
ఒకవైపు రొమాంటిక్, మరోవైపు రఫ్... ఇలా రెండు రకాల పోస్టర్లతో గురువారం అభిమానులకు డబుల్ ధమాకా ఇచ్చారు సూర్య. బర్త్ డే (జూలై 23) సందర్భంగా ఆయన తాజా చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’లోని ‘కాటుక కనులే మెరిసిపోయే పిలడా నిను చూసి...’ అంటూ సాగే పాటని విడుదల చేశారు. ఈ పాటలో సూర్య, అపర్ణా బాలమురళిల పోస్టర్ రొమాంటిక్‌గా ఉంది.
జీవీ ప్రకాశ్‌కుమార్ సమకూర్చిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా, సింగర్ ధీ పాడారు. ఈ చిత్రానికి ‘గురు’ ఫేమ్ సుధా కొంగర దర్శకురాలు. ఇక మరో లుక్ విషయానికొస్తే, సూర్య ఇటీవల సైన్ చేసిన ‘వాడీవాసల్’ అనే తమిళ సినిమా పోస్టర్ కూడా విడుదలైంది. ఇందులో సూర్య చాలా రఫ్‌గా కనిపించారు. వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ఆరంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment