వరలక్ష్మీ దాగుడుమూతలు | Varalaxmi Sarathkumar turns director with Kannamoochi | Sakshi
Sakshi News home page

వరలక్ష్మీ దాగుడుమూతలు

Published Mon, Oct 19 2020 5:43 AM | Last Updated on Mon, Oct 19 2020 5:43 AM

Varalaxmi Sarathkumar turns director with Kannamoochi - Sakshi

వరలక్ష్మీ శరత్‌కుమార్‌ దాగుడుమూతలు ఆడుతున్నారు. చిన్నప్పుడు ఆడుకునే దాగుడుమూతలు ఆటని ఇప్పుడు ఆడుతుందేంటి అనుకుంటున్నారా? అసలు విషయం ఏంటంటే.. వరలక్ష్మీ ‘కన్నామూచ్చి’ అనే తమిళ సినిమాతో డైరెక్టర్‌గా మారబోతున్నారు. ‘కన్నామూచ్చి’ అంటే తెలుగులో దాగుడుమూతలు అని అర్థం. మహిళా ప్రధానంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని తేనాండల్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మించనుంది. సోషల్‌ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసి, వరలక్ష్మీ మాట్లాడుతూ– ‘‘ఫైనల్‌గా దర్శకురాలిగా కొత్త అవతారంలోకి అడుగుపెడుతున్నాను. దర్శకురాలిగా కష్టపడి నేనేంటో నిరూపించుకుని, మీ (ప్రేక్షకులు) అందరి ముందు తలెత్తుకుని నిలబడతాను’’ అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement