సరికొత్త కాంబినేషన్‌ | Director Selvaraghavan and Keerthy Suresh in Saani Kaayidham | Sakshi
Sakshi News home page

సరికొత్త కాంబినేషన్‌

Published Sun, Aug 16 2020 4:50 AM | Last Updated on Sun, Aug 16 2020 4:52 AM

Director Selvaraghavan and Keerthy Suresh in Saani Kaayidham - Sakshi

సెల్వ రాఘవన్‌, కీర్తీ సురేష్

శనివారం కీర్తీ సురేష్‌ ఓ కొత్త చిత్రాన్ని ప్రకటించారు. అయితే ఇందులో ఓ విశేషం ఉంది. ఈ చిత్రంలో ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్‌ ముఖ్య పాత్ర చేయనున్నారు. ‘7/జి బృందావన్‌ కాలనీ’, ‘యుగానికి ఒక్కడు, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు ఆయన. ఇప్పుడు సెల్వ రాఘవన్, కీర్తీ సురేష్‌ ముఖ్య పాత్రల్లో ‘సాని కాయిదం’ అనే తమిళ చిత్రం తెరకెక్కనుంది. అరుణ్‌ మాతేశ్వరన్‌ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా పోస్టర్‌ ను విడుదల చేశారు. ‘‘దర్శకుడు సెల్వ రాఘవన్‌ గారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం చాలా సంతోషం’’ అన్నారు కీర్తీ సురేష్‌. ‘‘మరో కొత్త అధ్యాయం ప్రారంభం’’ అన్నారు సెల్వ రాఘవన్‌. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement