
Sakshi Excellence Awards: హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ హాలులో ‘సాక్షి మీడియా 2019 ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్ 17న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా.. నటి జమునకు జీవిత సాఫల్య పురస్కారం దక్కింది. ఈ పురస్కారంపై ఆమె స్పందిస్తూ.. ‘‘సాక్షి’వారి జీవిత సాఫల్య పురస్కారం అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ‘సాక్షి’ టీవీకి చాలాసార్లు నా ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా జరిగింది. సీనియర్ ఆర్టిస్టుగా ఎన్నో అవార్డులు అందుకున్నాను. కానీ ‘సాక్షి’ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతాభివందనాలు’ అని అన్నారు.