lifetime achievement
-
‘సాక్షి’ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది: జమున
Sakshi Excellence Awards: హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ హాలులో ‘సాక్షి మీడియా 2019 ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్ 17న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా.. నటి జమునకు జీవిత సాఫల్య పురస్కారం దక్కింది. ఈ పురస్కారంపై ఆమె స్పందిస్తూ.. ‘‘సాక్షి’వారి జీవిత సాఫల్య పురస్కారం అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ‘సాక్షి’ టీవీకి చాలాసార్లు నా ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా జరిగింది. సీనియర్ ఆర్టిస్టుగా ఎన్నో అవార్డులు అందుకున్నాను. కానీ ‘సాక్షి’ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతాభివందనాలు’ అని అన్నారు. -
8 ఏళ్లనాటి కల.. 88 ఏళ్ల వయసులో సాకారం.!
-
8 ఏళ్లనాటి కల.. 88 ఏళ్ల వయసులో సాకారం.!
సాక్షి, చెన్నై: కలలు కనండీ.. వాటిని సాకారం చేసుకునేందుకు కష్టపడండీ అని మాజీ రాష్ట్రపతి, స్వర్గీయ అబ్దుల్ కలాం చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఓ వ్యవసాయదారుడు రూపాయి రూపాయి కూడబెట్టి తన ఎనిమిదేళ్లనాటి కళను 88 ఏళ్ల వయసులో సాకారం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు కాంచీపురానికి చెందిన రైతు పేరు దేవరాజన్. ప్రస్తుతం ఆయన వయసు 88 సంవత్సరాలు. అయితే ఆయన 8 ఏళ్ల వయసులో ఉండగా తొలిసారి ఓ బెంజ్ కారుని చూసి, ఎలాగైనా దానిని కొనాలనుకున్నారు. అప్పుడు అతనికి కనీసం ఆ కారు పేరు కూడా తెలియకపోవడంతో లోగోను మనసులో పదిలపరుచుకున్నారు. ఇటీవల దేవరాజన్ చెన్నైలోని బెంజ్ కారు డీలర్ అయిన ట్రాన్స్ కార్ ఇండియాలో ఈ మధ్యే రూ.33 లక్షలు పెట్టి మెర్సిడీజ్ బెంజ్ బీ క్లాస్ కారును కొన్నారు. దేవరాజన్ కథ తెలిసిన ట్రాన్స్ కార్ ఇండియా దీనిని ఓ వీడియో తీసి యూట్యూబ్‌లో షేర్ చేసింది. ఆయనతో ఓ కేక్ కూడా కట్ చేయించారు. ‘దేవరాజన్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్’ అంటూ ఈ స్ఫూర్తిదాయకమైన స్టోరీని రూపొందించింది. ఆశయం గొప్పదైతే ఎప్పటికైనా విజయం వరిస్తుందని ఈ రైతు నిరూపించారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ఆరవై ఏళ్లుగా అలరిస్తున్న స్వరం
‘జిత్’కు జీవిత సాఫల్య పురస్కారం రాజమహేంద్రవరం కల్చరల్ : తన స్వరంతో ఆరు దశాబ్దాలుగా అలరిస్తున్న శ్రీపాద జిత్ మోహన్ మిత్రా జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. గాయకుడిగానే కాక నటుడు, క్రీడాకారుడు, న్యాయవాదిగా సేవలందించిన ఆయనకు నవరస నటసమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రంలో రొటేరియన్ పట్టపగలు వెంకటరావు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మేయర్ పంతం రజనీ శేషసాయి, ఇతర ప్రముఖులు పురస్కారాన్ని అందించారు. ఆరు దశాబ్దాలకు పైగా తన పాటలతో కళాభిమానులను అలరిస్తున్న జిత్.. భవిష్యత్‌లో మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ముందుగా జిత్ మోహన్‌మిత్రా ఆర్కెస్ట్రా తరఫున గాయకులు సినీ గీతాలను ఆలపించారు. చిన్నారి షైలిక పాత్రో కూచిపూడి నృత్యం అలరించింది. కార్యక్రమంలో మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ ఎస్.శివరామసుబ్రహ్మణ్యం, శ్రీపాద కుమారశర్మ, రుంకాని వెంకటేశ్వరరావు, మధు ఫామ్రా, అశోక్ కుమార్ జైన్, ఎస్బీ చౌదరి, మహ్మద్‌ఖాదర్ ఖాన్, గుమ్మడి సమర్పణరావు, బొడ్డు బుల్లెబ్బాయి పాల్గొన్నారు. జిత్‌కు పద్మశ్రీ ఇవ్వాలని పట్టపగలు కోరారు. ఆనం కళాకేంద్రం అద్దెలు తగ్గించాలని పలువురు కోరగా ఈ మేరకు కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపామని గోరంట్ల చెప్పారు.