8 ఏళ్లనాటి కల.. 88 ఏళ్ల వయసులో సాకారం.! | 88 Year Old Farmer Buys Mercedes Benz Car in Tamil Nadu | Sakshi
Sakshi News home page

8 ఏళ్లనాటి కల.. 88 ఏళ్ల వయసులో సాకారం.!

Published Fri, Jul 13 2018 6:50 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

88 Year Old Farmer Buys Mercedes Benz Car in  Tamil Nadu - Sakshi

సాక్షి, చెన్నై:  కలలు కనండీ.. వాటిని సాకారం చేసుకునేందుకు కష్టపడండీ అని మాజీ రాష్ట్రపతి, స్వర్గీయ అబ్దుల్ కలాం చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఓ వ్యవసాయదారుడు రూపాయి రూపాయి కూడబెట్టి తన ఎనిమిదేళ్లనాటి కళను 88 ఏళ్ల వయసులో సాకారం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు కాంచీపురానికి చెందిన రైతు పేరు దేవరాజన్. ప్రస్తుతం ఆయన వయసు 88 సంవత్సరాలు. అయితే ఆయన 8 ఏళ్ల వయసులో ఉండగా తొలిసారి ఓ బెంజ్‌ కారుని చూసి, ఎలాగైనా దానిని కొనాలనుకున్నారు. అప్పుడు అతనికి కనీసం ఆ కారు పేరు కూడా తెలియకపోవడంతో లోగోను మనసులో పదిలపరుచుకున్నారు.  

ఇటీవల దేవరాజన్‌ చెన్నైలోని బెంజ్ కారు డీలర్ అయిన ట్రాన్స్ కార్ ఇండియాలో ఈ మధ్యే రూ.33 లక్షలు పెట్టి మెర్సిడీజ్ బెంజ్ బీ క్లాస్ కారును కొన్నారు. దేవరాజన్‌ కథ తెలిసిన ట్రాన్స్ కార్ ఇండియా దీనిని ఓ వీడియో తీసి యూట్యూబ్‌లో షేర్ చేసింది. ఆయనతో ఓ కేక్ కూడా కట్ చేయించారు. ‘దేవరాజన్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ అంటూ ఈ స్ఫూర్తిదాయకమైన స్టోరీని రూపొందించింది. ఆశయం గొప్పదైతే ఎప్పటికైనా విజయం వరిస్తుందని ఈ రైతు నిరూపించారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement