
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఇడుపులపాయలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్సార్ జయంతి వేడుకలు నిర్వహించారు. దీనిలో భాగంగా సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి.. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజంపేట మండలంలో రైతు దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున రెడ్డి, రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యే కార్యాలయంలో పార్టీ జెండాను ఎగురవేశారు.
Comments
Please login to add a commentAdd a comment