వైద్య రంగంలో విశ్వసనీయమైన సమాచారా న్ని అందించేందుకు ‘సాక్షి లైఫ్’ను తీసుకొచ్చింది సాక్షి మీడియా గ్రూప్. సమస్త ఆరోగ్య సమచారాన్ని సమగ్రంగా ఆర్టికల్స్, వీడియోల రూపంలో తీర్చిదిద్దింది. ఆరోగ్యం పట్ల అవగాహన పెంచేందుకు నిష్ణాతులైన డాక్టర్ల సూచనలు, సలహాలతో పాటు ఆహారం, వ్యాయామాల గురించి వివరంగా ఇందులో నిక్షిప్తం చేసింది.
life.sakshi.com పేరుతో వచ్చిన ఈ వెబ్‌సైట్‌లో వైద్యరంగానికి సంబంధించిన అన్ని అప్‌డేట్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. వివిధ విభాగాలకు సంబంధించి ప్రముఖ వైద్యు ల ఇంటర్వ్యూలు, నిపుణుల సలహాలను వీడియోల రూపంలో యూట్యూబ్‌లో sakshi life ఛానల్‌లో అప్‌లోడ్ చేసింది. ‘సాక్షి‘ ఇద్దరి స్పూర్తితో ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. వైద్యరంగం నుంచి వచ్చి రాజకీయ నాయకుడిగా ఎదిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించిన మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఒకరు.
రూపాయికే వైద్యం అందించి ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయిన వైఎస్సార్.. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ ని తీసుకొచ్చి ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. మరొకరు డాక్టర్ ఈ.సీ.గంగిరెడ్డి. నిస్వార్థ వైద్య సేవలకు మారుపేరుగా నిలిచి ప్రజల గుండెల్లో కొలువైన డాక్టర్ ఈసీ గంగిరెడ్డి వైద్యం వృత్తి కాదు,ప్రాణం అని నమ్మారు. ఈ ఇద్దరి మహనీయుల స్ఫూర్తితో ‘సాక్షి లైఫ్ ‘ తెలుగు ప్రజల ముందుకు వస్తోంది.
ఆరోగ్య సమాచారాన్ని సులువుగా తెలుగు వారందరికీ అందించాలన్నదే ‘సాక్షి’ లక్ష్యం. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, శ్రీమతి వై.ఎస్.భారతి రెడ్డి ‘సాక్షి లైఫ్’ వెబ్‌సైట్ తో పాటు యూట్యూబ్ ఛానెల్ ను లాంఛనంగా ఆవిష్కరించారు. సాక్షి లైఫ్ ప్రజలందరి ఆరోగ్య నేస్తం. అందుబాటులో ఉన్న వేర్వేరు వైద్య విధానాల గురించి చెప్పడమే కాదు, అసలు వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి కూడా తెలియజేస్తుంది.
life.sakshi.com
https://www.youtube.com/@life.sakshi
సాక్షి లైఫ్‌ప్రారంభం సందర్భంగా ప్రముఖ డాక్టర్లు ఏమన్నారంటే...
‘హెల్త్ కు సంబంధించిన విశ్వసనీయమైన సమాచారం సాక్షి లైఫ్‌లో ఉంది. ఇది సమాజానికి చాలా అవసరం.’
– డా.డి.నాగేశ్వర్ రెడ్డి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత
‘ప్రస్తుతం నమ్మకమైన వైద్య సమాచారం అందుబాటులో లేదు, ఆ లోటును సాక్షి లైఫ్ భర్తీ చేస్తుందనుకుంటున్నాను’ .
– డా. మంజుల అనగాని, ప్రముఖ గైనకాలజిస్ట్
‘వైద్యరంగంలో పరిశోధనలు, వాటి విశేషాలను ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి. వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించేలా సాక్షి లైఫ్‌ను తీర్చిదిద్దారు’.
– డా. చిన్నబాబు సుంకవల్లి, రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్
‘ప్రతీ ఒక్కరికి గుండె కీలకం, అది ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలన్నది సాక్షి లైఫ్‌లో విపులంగా చె΄్పారు’.
– డా. ఎమ్.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ ఇంటర్ వెన్షనల్ కార్డియాలజిస్ట్
‘జీవనశైలిలో మార్పులే రోగాలకు కారణం, ఈ విషయంపై సాక్షి లైఫ్‌లో నిపుణుల సలహాలున్నాయి.’
– డా.గోపీ చంద్ మన్నం, చీఫ్ కార్డియో థొరాసిక్ సర్జన్
‘ఆరోగ్య రంగానికి సంబంధించిన సరైన సమాచారాన్ని నిపుణులైన వైద్యుల ద్వారా అందుబాటులోకి తెచ్చిన ‘సాక్షి లైఫ్‘ కు వెల్‌కమ్’
– డా.కోనేటి నాగేశ్వరరావు, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్
‘మానసిక సమస్యలు పైకి చెప్పుకోలేని వారికి సాక్షి లైఫ్‌లో నిపుణుల ఇంటర్వ్యూల ద్వారా మంచి అవగాహన కలుగుతుంది, ఆల్ ది బెస్ట్’
– డా. పూర్ణిమ నాగరాజు, సైకియాట్రిస్ట్
‘ఆర్థరైటిస్ సమస్యలు తలెత్తడా నికి కారణాలు.. ముందుగా తెలుసుకుంటే అవి రాకుండా జాగ్రత్త పడొచ్చు.. ఇలాంటి సమా చారాన్ని సాక్షి లైఫ్ ద్వారా అందిస్తున్నారు.’
– డా.కె. జె.రెడ్డి, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్
Comments
Please login to add a commentAdd a comment