వైఎస్సార్ జిల్లా వేంపల్లె ఎన్నికల ప్రచారంలో సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతమ్మ (ఇన్‌సెట్‌లో) అనారోగ్యంతో ఉన్న ఓ మహిళతో ఆప్యాయంగా వైఎస్ భారతమ్మ
సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు
సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రజలు సంతోషంగా ఉన్నారు
పులివెందులలో అభివృద్ధి కళ్లకు కడుతోంది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ
వేంపల్లె : మాజీ సీఎం చంద్రబాబునాయుడు విచక్షణతో మాట్లాడాలని సీఎం జగన్‌మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ అన్నారు. వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని చెప్పారు. ఆమె సోమవారం వైఎస్సార్ జిల్లా వేంపల్లెలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ను చంపితే ఏం చేస్తారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. చంద్రబాబు వయసులో పెద్దవారని, ప్రజా జీవితంలో ఇలాంటి మాటలు మాట్లాడటం తగదని అన్నారు.
ఇలాంటి ఆలోచనలు మంచివి కావన్నారు. విశాఖ, విజయవాడల్లో జరిగిన హత్యాయత్నాల లాంటి ఘటనలను ప్రేరేపించడం దారుణమన్నారు. పులివెందుల నియోజకవర్గంలో అభివృద్ధి లేదని మాట్లాడే వాళ్లకు కళ్లు లేవని అనుకుంటున్నానని అన్నారు. కోట్లాది రూపాయలతో చేసిన అభివృద్ధి కళ్లకు కట్టినట్టు కనిపిస్తోందని చెప్పారు. అవ్వాతాతలు, దివ్యాంగులు, మహిళలు అందరూ జగన్‌ను వారి పెద్ద కొడుకని, నెలనెలా ఇంటికి డబ్బు ఇస్తున్నాడని తన ఎన్నికల ప్రచారం సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు.
ఐదేళ్లకు ముందు ఎన్నికల ప్రచారంలో ప్రతి ఇంటి ముంగిట సమస్యలు ఉన్నాయని, మాకు అవి రాలేదు ఇవి రాలేదని చెప్పేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని తెలిపారు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నామని, సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి అండగా ఉంటామని ప్రజలంతా చెప్పారన్నారు. సంక్షేమ పథకాలు చాలా బాగా అందుతున్నాయని ప్రజలు చెబుతుండటంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీ‹Ùకుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ రవికుమార్‌రెడ్డి, మండల కన్వీనర్ చంద్ర ఓబుల్‌రెడ్డి, ఎంపీపీ లక్ష్మిగాయత్రి, సర్పంచ్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment