
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ భారతి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆదివారం వారికి ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ దంపతులపై జగన్నాథస్వామి, తిరుమల బాలాజీ ఆశీస్సులు కురిపించాలని ఆకాంక్షించారు. సీఎం దంపతులకు కలకాలం ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించి.. సుసంపన్నమైన జీవితాన్ని అందించాలని గవర్నర్ అభిలషించారు.