ఘనంగా 'సాక్షి ఎక్స్‌లెన్స్‌’ అవార్డుల కార్యక్రమం | Sakshi Excellence Awards Program Conduct At Hyderabad | Sakshi
Sakshi News home page

Sakshi Excellence Awards: ఘనంగా 'సాక్షి ఎక్స్‌లెన్స్‌’ అవార్డుల కార్యక్రమం

Published Sat, Sep 18 2021 2:01 AM | Last Updated on Sat, Sep 25 2021 6:05 PM

Sakshi Excellence Awards Program Conduct At Hyderabad

శుక్రవారం హైదరాబాద్‌లో ‘సాక్షి ఎక్స్‌లెన్స్‌’ అవార్డుల కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభిస్తున్న గవర్నర్‌ తమిళిసై. చిత్రంలో వైఎస్‌ భారతీరెడ్డి, ప్రముఖ జర్నలిస్ట్‌ సాగరికా ఘోష్‌

సాక్షి, హైదరాబాద్‌: ఎంచుకున్న ఆశయాన్ని మన సంతా నింపుకొని, కలలో కూడా మర్చిపోకుండా కృషి చేసిన వారే అద్భుత విజయాలు అందుకుంటారని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై చెప్పారు. అంకిత భావం వ్యక్తులను ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని పేర్కొన్నారు. విభిన్న రంగాల్లో విజయాలు సాధించినవారిని గుర్తించి పురస్కారాలు అందించే ‘సాక్షి ఎక్స్‌లెన్స్‌’ అవార్డుల కార్యక్రమాన్ని శుక్రవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ జేఆర్సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించారు. ఇందులో గవర్నర్‌ తమిళిసై ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

నమ్ముకున్న ఆశయాలకు కట్టుబడి ఎన్నో విజయాలను సాధించవచ్చని నిరూపించిన వారు మన చుట్టూరా ఎందరో ఉన్నారని చెప్పారు. అలాంటి వారిని గుర్తించి అవార్డులు అందించడం గొప్ప విషయమని ‘సాక్షి’ మీడియాను అభినందించారు. కరోనా వేవ్‌ల సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి శ్రమించిన వైద్యులు, ఇతర ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల సేవలకు ఈ సందర్భంగా సెల్యూట్‌ చేస్తున్నానన్నారు. అవార్డు గ్రహీతలకు గవర్నర్‌ పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో వైఎస్‌ భారతీరెడ్డితోపాటు పలువురు సినీరంగ ప్రముఖులు, ‘సాక్షి’ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.  
(చదవండి: సైదాబాద్‌ నిందితుడి మృతిపై జ్యుడీషియల్‌ విచారణ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement