అమెరికాలోని టెన్నెస్సీ తెలుగు సమితి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. అధ్యక్షులు దీప్తి రెడ్డి దొడ్ల నాయకత్వంలో జరిగిన ఈ ఉగాది సంబరాల్లో లైవ్ కాన్సర్ట్‌లో గాయనీ గాయకులు సుమంగళి, గీతా మాధురి, రోహిత్, శ్రీకాంత్, మెహర్ చంటి లైవ్ బాండ్‌తో అలరించారు. సుమారు 800 మంది ఆహుతులు పాల్గొన్న ఈకార్యక్రమాన్ని ముందుగా షాలిని వేమూరి భరతనాట్యంతో ప్రారంభించారు. క్రిస్టల్ ఈవెంట్స్ వారు చక్కని స్టేజి డెకరేషన్, ఫోటో బూత్ రెడీ చేయగా, మామ్ అండ్ మీ కాన్సెప్ట్ తో నిర్వహించిన ఫ్యాషన్ షో అందరిని ఆకట్టుకుంది. తొలుత సోలో, తర్వాత డ్యూయెట్ పాటలతో స్టేజి మార్మోగిపోయింది. యాంకర్ సాహిత్య తన వ్యాఖ్యానంతో అబ్బురపరిచింది.
టెన్నెస్సీ తెలుగు సమితి తదుపరి కార్యవర్గాన్ని అధ్యక్షులు దీప్తి రెడ్డి సభకు పరిచయం చేశారు. ఈసందర్భంగా కమిటీ సభ్యులను, స్పాన్సర్స్, సింగర్స్ అందరిని సత్కరించారు. టాలెంట్ షో, తానా క్యూరీ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. రాఫుల్ విజేతలకు అయిదు గ్రాముల గోల్డ్ కాయిన్స్ అందజేయడం విశేషం. అలాగే వినయ గోపిశెట్టి రూపకల్పన చేసిన విభా ఫ్యాషన్ షో హైలెట్‌గా నిలిచింది. గ్రాండ్ ఫినాలేలో భాగంగా చేసిన డ్రమ్స్ షో, సింగర్స్ సంగీతం స్టాండింగ్ ఒవేషన్ అతిథులను ఆకట్టుకుంది. పెద్దలు కార్యక్రమాన్ని ఆస్వాధించడంకోసం తమ పిల్లలకు విడిగా ప్రొఫెషనల్ ఎంటర్టైన్మెంట్ ఏర్పాటు చెయ్యడం విశేషం.
చివరిగా అధ్యక్షులు దీప్తి రెడ్డి ఈ కార్యక్రమానికి సహాయసహకారాలు అందించిన టీటీయస్ కార్యవర్గ సభ్యులు, అడ్వైజరీ కమిటీ, యూత్ కమిటి, స్పాన్సర్స్, అలాగే ఉగాది పచ్చడితోపాటు రుచికరమైన భోజనాన్ని అందించిన అమరావతి రెస్టారెంట్, విజయవంతంచేసిన ప్రేక్షకులు, ప్రత్యేకంగా ప్లాటినం స్పాన్సర్షిప్ ద్వారా లైవ్ బాండ్‌ని సమర్పించిన డాక్టర్ దీపక్ రెడ్డికి కృతఙ్ఞతలు తెలియజేయడంతో కార్యక్రమం ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment