
తొలి పండగ.. ఆనందమే నిండుగా!
తీపి, చేదు, వగరు రుచులు.. పంచాంగ శ్రవణం, ఆలయాల దర్శనంతో హేవిళంబినామ సంవత్సరానికి బుధవారం జిల్లా ప్రజలు ఘనస్వాగతం పలికారు.
సాయిబాబ దేవాలయం, గంజిపేటలోని వెంకటేశ్వరస్వామి దేవాలయం, క్రిష్ణమందిరం, వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం, కోటలోని చెన్నకేశవస్వామి ఆలయం, పెద్దఅగ్రహారంలోని అహోబిల మఠం వద్ద భక్తులు అధికసంఖ్యలో దైవదర్శనం చేసుకున్నారు. అలంపూర్ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయం, జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో భక్తులు విశేషపూజలు చేశారు. మల్దకల్ స్వయంభు లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. అయిజ, శాంతినగర్, గట్టు, ధరూరు, ఇటిక్యాల, మానవపాడు, కేటీదొడ్డి, రాజోలి, ఉండవెల్లి మండలాల్లోని ప్రతిపల్లె కళకళలాడింది.