
సాక్షి, హైదరాబాద్ : రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నాత్తే’.వచ్చే నెల చివరికల్లా ‘అన్నాత్తే’ సినిమా పూర్తి చేసి, గుమ్మడికాయ కొట్టేయాలని చిత్రబృందం ప్లాన్ అని సమాచారం. రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. రజనీకాంత్, జగపతిబాబుపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వచ్చే నెల 10 వరకు జరిగే షెడ్యూల్‌తో చిత్రీకరణ దాదాపు పూర్తవుతుందట. ఆ తర్వాత చెన్నైలో ‘అన్నాత్తే’కి ఫైనల్ టచ్ ఇచ్చి, గుమ్మడికాయ కొడతారని తెలిసింది. దీపావళి సందర్భంగా ఈ ఏడాది నవంబరు 4న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.
బసిరెడ్డిని మించి..
‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాలో బసిరెడ్డి పాత్రలో అదరగొట్టారు జగపతిబాబు. తాజాగా ‘అన్నాత్తే’లోని తన ఈవిల్ లుక్ బాగుంటుందని, ఫైనల్‌గా బసిరెడ్డిని మించిన పాత్ర తనకు ‘అన్నాత్తే’లో దొరికిందని, ఇందుకు రజనీకాంత్‌సార్‌కి ధన్యవాదాలు అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు జగపతిబాబు.
Comments
Please login to add a commentAdd a comment