ఆత్మస్థైర్యంతోనే క్యాన్సర్‌పై విజయం : నాగార్జున
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్) : ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్‌ను ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవచ్చని సినీ నటుడు అక్కినేని నాగార్జున అన్నారు. నేషనల్ క్యాన్సర్ సర్వైవర్స్ డే సందర్భంగా శనివారం సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి రూపొందించిన 'డోంట్ ఫైట్ అలోన్' అనే నినాదంతో క్యాన్సర్ సపోర్ట్ గ్రూప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్ వ్యాధితో బాధపడే వారికి వైద్యులు, స్నేహితులు, కుటుంబ సభ్యులకంటే ఆ వ్యాధిని జయించిన వారు ఇచ్చే స్ఫూర్తి ఎంతో ధైర్యాన్ని అందిస్తుందన్నారు.
తన తండ్రి (అక్కినేని నాగేశ్వరరావు)కి క్యాన్సర్ అని తెలిసినపుడు తమ కుటుంబం మొత్తం ఎంతో తల్లడిల్లిపోయిందని చెప్పారు. తాము భయపడుతుంటే ఆయనే తమకు ధైర్యం చెప్పారని గుర్తు చేసుకున్నారు. తన ముందుకు వచ్చే వాళ్లు నవ్వుతూనే రావాలని ఆయన చెప్పేవారని నాగార్జున తెలిపారు. కిమ్స్ ఆస్పత్రి ఎండీ, సీఈవో డాక్టర్ భాస్కర్‌రావు, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ డెరైక్టర్ డాక్టర్ రఘురాంలు మాట్లాడుతూ.. ఏటా 10 లక్షల మంది కొత్తగా క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నారని తెలిపారు. క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడం, క్యాన్సర్‌ను జయించిన వారితోనే సందేహాలు నివృత్తి చేయించడం, ఒకరి బాధలు ఒకరు పంచుకోవడం ఈ గ్రూపు ఉద్దేశమన్నారు.