కిమ్స్ హాస్పిటల్స్కు ఫార్మసీ డి క్వాలిటీ గుర్తింపు | Excellence recognised for KIMS hospitals | Sakshi
Sakshi News home page

కిమ్స్ హాస్పిటల్స్కు ఫార్మసీ డి క్వాలిటీ గుర్తింపు

Published Sat, Oct 22 2016 12:32 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM

కిమ్స్ హాస్పిటల్స్కు ఫార్మసీ డి క్వాలిటీ గుర్తింపు

కిమ్స్ హాస్పిటల్స్కు ఫార్మసీ డి క్వాలిటీ గుర్తింపు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అత్యుత్తమ ఫార్మసీ విధానాలకు గాను ప్రతిష్టాత్మకమైన ‘ఫార్మసి డి క్వాలిటీ’ ప్లాటినం రేటింగ్ గుర్తింపు దక్కించుకున్నట్లు కిమ్స్ హాస్పిటల్స్ వెల్లడించింది. దక్షిణాదిలో ఈ పురస్కారం దక్కించుకున్న మొట్టమొదటి ఆస్పత్రి తమదేనని పేర్కొంది. అబాట్ హెల్త్‌కేర్ డెరైక్టర్ విశ్వనాథ్ స్వరూప్, బ్యూరో వెరిటాస్ ప్రతినిధి నుంచి కిమ్స్ హాస్పిటల్స్ డెరైక్టర్ (ఆపరేషన్స్ విభాగం) డి. అనిత తదితరులు ఈ సర్టిఫికేషన్‌ను అందుకున్నారు. 

ఈ స్ఫూర్తితో మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని కిమ్స్ ఆస్పత్రుల సీఈవో బి. భాస్కర్‌రావు తెలిపారు. ఔషధాల నిర్వహణ, పంపిణీ తదితర  అయిదు అంశాల ప్రాతిపదికన ఇచ్చే ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌ను అబాట్ హెల్త్‌కేర్, బ్యూరో వెరిటాస్ సంయుక్తంగా రూపొందించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement