డాక్టర్‌ పి రఘురామ్‌కు బ్రిటిష్‌ ఎంపైర్‌ ఓబీఈ అవార్డు | Dr P Raghuram Received The British Empire OBE Award | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ పి రఘురామ్‌కు బ్రిటిష్‌ ఎంపైర్‌ ఓబీఈ అవార్డు

Published Wed, Mar 30 2022 8:41 PM | Last Updated on Thu, Mar 31 2022 7:06 PM

Dr P Raghuram Received The British Empire OBE Award - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బ్రిటిష్‌ రెండో అత్యున్నత ర్యాంకింగ్‌ అవార్డు ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ ఎంపైర్‌–2021’ను ఉషాలక్ష్మి రొమ్ము వ్యాధుల కేంద్రం డైరెక్టర్, ఉషాలక్ష్మి బ్రెస్ట్‌ కేన్సర్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక సీఈఓ డాక్టర్‌ పి.రఘురామ్‌ అందుకున్నారు. ఈ అవార్డును అందుకున్న అత్యంత పిన్నవయస్కుడిగా ఆయన ఘనత సాధించారు. లండన్‌ దగ్గర్లోని విండ్సర్‌ క్యాసిల్‌లో జరిగిన వేడుకలో ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ ప్రిన్స్‌ చార్లెస్‌ ఈ అవార్డును ప్రదానం చేశారు.

భారత్‌లో రొమ్ము కేన్సర్‌ నుంచి సంరక్షణ, శస్త్ర చికిత్స విద్యను మెరుగుపరచడం, యూకే–భారత్‌ మధ్య సత్సంబంధాలకు అత్యుత్తమ సేవలు అందించినందుకు రఘురామ్‌ ఈ అవార్డును పొందారు.కిమ్స్‌ఆస్పత్రిలోని సహో ద్యోగులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భార తీయ శస్త్ర చికిత్స డాక్టర్లకు ఈ అవార్డును అంకి తం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రఘురామ్‌ అత్యంత చిన్నవయసులో 2015లో పద్మశ్రీని, 2016లో బీసీ రాయ్‌ నేషనల్‌ అవార్డును అప్ప టి రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement